రాష్ట్రంలో వైకాపా నేతలు... విపక్ష నేతలపై దాడులకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర భాజపా నాయకులు ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి విపక్ష నేతలపై దాడులు పెరిగాయని రాష్ట్ర భాజపా కార్యదర్శి కోలా ఆనంద్, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కిలారు దీలిప్, యువ మోర్చా నేత రమేష్ నాయుడు ధ్వజమెత్తారు. తమ ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: