- నేడు ముఖ్యమంత్రి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ
cm jagan-tollywoods bigwigs meet: రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై ముఖ్యమంత్రితో నేడు సినీ ప్రముఖులు చర్చించనున్నారు. కొవిడ్‌తో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ... టికెట్ రేట్లు పెంచాలని కోరనున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాలని విన్నవించే అవకాశం ఉంది. అయితే... సినీ పరిశ్రమ సమస్యలపై కొందరు హీరోలతో మాత్రమే చర్చించడం సరైన విధానం కాదనే విమర్శలు వస్తున్నాయి.
- నేడు నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి.. పోలీసుల ముందస్తు అరెస్టులు
Unemployed youth protest: రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. అయితే.. ఈ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. పలు చోట్ల విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.
- సుద్దపల్లి క్వారీ వద్దే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష.. తెదేపా నేతల గృహనిర్బంధం
Dhulipalla Narendra Deeksha at Suddapalli: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో అక్రమ మైనింగ్ ఆపాలంటూ... తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. వణికించే చలిలో రాత్రి మైనింగ్ ప్రాంతంలోనే నిద్రించారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదని తేల్చిచెప్పారు.
- Auto Nagars: రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లోని ఆటోనగర్లపై కన్ను
రాష్ట్రవ్యాప్తంగా ఆటోనగర్లు, పారిశ్రామికవాడలను ఊరికి దూరంగా తరలిస్తామని చెబుతున్న ప్రభుత్వానికి వాటిపై కన్ను పడినట్లు తెలుస్తోంది. వాటిలో సగం స్థలం తనకు ఇచ్చేయాలంటూ.. ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. అయితే దీనిపై స్థానికులు, వ్యాపారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఆటోనగర్లు, పారిశ్రామికవాడలపై ఆధారపడి మేం బతుకుతూ కొన్ని లక్షల మందిని బతికిస్తున్నాం..అయినా కొనుక్కున్న భూముల్లో సగం ఉచితంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని పరిశ్రమల యజమానుల ప్రశ్నిస్తున్నారు.
- అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. రైతుకు రెండు యూరియా బస్తాలే
Shortage of urea: గత సీజన్లో అధిక వర్షాలతో నష్టపోయిన రైతన్నలను ఈసారి ఎరువుల కష్టం వెంటాడుతోంది. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి పంటలు వేసిన అన్నదాతలు.. ఈసారైనా దిగుబడి బాగా వస్తుందని ఆశించారు. అయితే సమయానికి ఎరువులు దొరక్కపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
- Seediri Appala Raju: సీఐపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు కలకలం... చొక్కా పట్టుకొని లాగేస్తానంటూ..!
seediri appala raju: పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలోని శారదాపీఠం ముఖద్వారం వద్ద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బుధవారం ఉదయం మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరవగా... సీఐ రాజుల్నాయుడు అడ్డుకోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు.
- యూపీ తొలి దశ పోలింగ్ షురూ.. 58 స్థానాల్లో పోరు
UP Election Phase 1: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
- ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్ పైపైకి!
Product Price Hike: కరోనా సంక్షోభం సామాన్యుడిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇది చాలదన్నట్లు నిత్యసవర వస్తువులు సహా వివిధ ఉత్పత్తుల ధరల పెరుగుదల మరింత వేదన మిగులుస్తున్నాయి. మూడు నెలలు పెరుగుదలకు విరామిచ్చిన పెట్రోల్ ధరలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అమాంతం ఆకాశాన్ని అంటుతాయని నివేదికలు చెబుతున్నాయి.
- DJ Tillu movie: 'అదే జరిగితే త్వరలో 'డీజే టిల్లు 2''
DJ Tillu movie: తనకు అవకాశాలు రాకపోవడం వల్లే రైటర్‌గా మారానని హీరో సిద్ధు అన్నారు. త్వరలో 'డీజే టిల్లు'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇతడు.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నాడు.
- ప్రపంచకప్ జట్టులో ఆ క్రికెటర్‌కు నో ఛాన్స్.. హాకీ మ్యాచ్‌కు రెడీ
త్వరలో జరిగే మహిళా ప్రపంచకప్ జట్టులో భారత క్రికెటర్ జెమీమాకు చోటు దక్కలేదు. దీంతో హాకీ టోర్నీ కోసం సిద్ధమైంది. ప్రాక్టీసు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.