ETV Bharat / city

అనుమతి రాగానే.. అందరికీ వ్యాక్సినేషన్: అనిల్ సింఘాల్ - అనిల్ సింఘాల్ తాజా వార్తలు

రాష్ట్రంలోని 637 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. 6,870 ఐసీయూ పడకల్లో 547 ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ విధులు చేసేవారికి 15 శాతం వరకు రెగ్యులర్ నియామాకాల్లో వెయిటేజీ ఇస్తామని వెల్లడించారు.

అనిల్ సింఘాల్
అనిల్ సింఘాల్
author img

By

Published : May 9, 2021, 7:17 PM IST

Updated : May 9, 2021, 9:00 PM IST

రాష్ట్రంలోని 637 ఆస్పత్రుల్లో కొవిడ్ చికత్స అందిస్తున్నట్లు వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. 6,870 ఐసీయూ పడకల్లో 547 ఖాళీగా ఉన్నాయన్న ఆయన... రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. 590 టన్నుల ఆక్సిజన్ వరకు కేంద్రం కోటా కేటాయించిందన్న అనిల్ సింఘాల్.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

24 గంటల్లో 104కు 15,926 ఫోన్స్ కాల్స్ వచ్చాయని తెలిపారు. 45 ఏళ్ల పైన ఉన్న వారికే వాక్సిన్ వేసేందుకు ముందుగా కేంద్రం అనుమతి కోరామన్న సింఘాల్.. తమ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. కొవిన్ వెబ్​సైట్ లో అప్లికేషన్ మాడిఫికేషన్​ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. అనుమతి వచ్చాక 45 ఏళ్ల పైన ఉన్న వారందరికీ వ్యాక్సిన్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కొవిడ్ విధులు చేసేవారికి రెగ్యులర్ నియామాకాల్లో వెయిటేటీ..

కొవిడ్ విధులు చేసేవారికి 15 శాతం వరకు రెగ్యులర్ నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని సింఘాల్ తెలిపారు. 6 నెలల సేవలకు-5మార్కులు, ఏడాదికి -10 మార్కులు, ఏడాదిన్నరకు-15 మార్కులు కేటాయిస్తామన్నారు. ఎవరికి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశామన్న ఆయన.. ప్రస్తుతం రెండో వ్యాక్సినేషన్​కు సరిపడినంత మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని వివరించారు. వ్యాక్సిన్ వేసే వారి ఫోన్​కు ఎస్ఎంఎస్ ద్వారా.. లేదా వాలంటీర్లతో సమాచారం అందిస్తామని వెల్లడించారు.

మెుదటి రౌండ్ టీకా ఎప్పుడు వేస్తామనే విషయాన్ని మళ్లీ తెలియజేస్తామన్న ఆయన.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ సహా, రాష్ట్రం కొనుగోలు చేసిన టీకాలతో వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు. ప్రజలందరూ కొన్ని రోజులు సహకరించాలని అనిల్ సింఘాల్ కోరారు.

మాట్లాడుతున్న అనిల్ సింఘాల్

ఇదీ చదవండి:

మంత్రి అప్పలరాజుపై.. కర్నూలు వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు

కరోనాతో పద్మ విభూషణ్​ అవార్డు గ్రహీత మృతి

Last Updated : May 9, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.