ETV Bharat / city

పిల్లల కోడిగుడ్లకూ.. బకాయిలే! - ఏపీ అంగన్​వాడీల్లో బిల్లుల పెండింగ్

అంగన్​వాడీ కేంద్రాలను పలు సమస్యలు వేధిస్తున్నాయి. కోడిగుడ్లకు సంబంధించిన బిల్లుల బకాయిలు మొదలుకుని.. కూరగాయల బిల్లులకూ మోక్షం కలగడం లేదు. గుత్తేదార్లకు చెల్లించాల్సిన బిల్లులు భారీ స్థాయిలో పేరుకుపోయాయి.

anganvadi bill pending
anganvadi bill pending
author img

By

Published : Nov 10, 2021, 9:00 AM IST

రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లకు సంబంధించిన బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. గుడ్లు సరఫరా చేసే గుత్తేదారులకు ప్రభుత్వం 4 నెలల బిల్లులు ఆపేసింది. సుమారు రూ.110 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని గుత్తేదారులు చెబుతున్నారు. పెరిగిన రవాణా ఖర్చులు, చెల్లింపుల్లో జాప్యంతో ఈ ప్రభావం సరఫరాపై పడింది. ప్రధానంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో గుడ్లను సక్రమంగా సరఫరా చేయడం లేదు. వారం, పది రోజుల్లో బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా సరఫరా నిలిపివేసే పరిస్థితి తలెత్తుతుందని గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 35 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఉన్నారు. వీరిలో పోషకాహార లోపం తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాల కింద ఆయా కేంద్రాలకు గుడ్లు అందిస్తున్నారు. సరఫరా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ద్వారా గుత్తేదార్లకు ఇచ్చింది. వీరికి గతేడాది వరకు ఏ నెల బిల్లులు ఆ నెల అందేవి. ఏప్రిల్‌ నుంచే జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించాల్సి ఉంది. 4, 5 జిల్లాలకు జూన్‌ బిల్లులూ రాలేదని గుత్తేదారులు చెబుతున్నారు.

కూరగాయల బిల్లులకూ మోక్షం లేదు..
అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే రాగి పిండి, బెల్లం, వేరుసెనగ చిక్కి, ఎండు ఖర్జూర, సజ్జ/జొన్న పిండి, అటుకులకు సంబంధించిన బిల్లులూ రెండు, మూడు నెలలవి చెల్లించాల్సి ఉందని గుత్తేదారులు అంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయల బిల్లులూ రావడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. కూరగాయల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలే నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చేతి నుంచి పెట్టుకొని.. రెండు, మూడు నెలలుగా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ బిల్లులదీ ఇదే పరిస్థితి.

టోకెన్‌ చేస్తున్నారు... కానీ
కోడిగుడ్ల బకాయిలకు అధికారులు టోకెన్లు చేస్తున్నారు. కానీ బిల్లులు పడట్లేదు. సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌ చూపిస్తోందని, బడ్జెట్‌ ఉన్నా ఇదేం పరిస్థితో తెలియడం లేదని గుత్తేదారులు వాపోతున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపునకు ఆర్థిక ఇబ్బందుల్లేవని, ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. కూరగాయల బిల్లుల మొత్తాలను జిల్లాలకు విడుదల చేశామని, ప్రాజెక్టు పరిధిలో బకాయిల చెల్లింపు బాధ్యత సీడీపీవోలదేనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: petrol rates: పెట్రో వాతపై హారన్ల మోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.