ETV Bharat / city

2 నెలలకూ కలిపి 100 కోట్లు దాటని ఆదాయం - andhrapradesh GDP

లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 2నెలలూ కార్యకలాపాలన్నీ స్తంభించిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. అంచనాల్లో నాల్గో వంతు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం సమకూరింది.

ap financial situation
ap financial situation
author img

By

Published : Jun 1, 2020, 8:41 AM IST

రూ.1,323 కోట్లు... రూ.1,360 కోట్లు... కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్‌, మే నెలల్లో సమకూరిన సొంత ఆదాయం ఇది. లాక్‌డౌన్‌ కారణంగా కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో ఆర్థిక చక్రం ఆగిపోయింది. దుకాణాలు లేవు, అమ్మకాలు అంతంతమాత్రం. రిజిస్ట్రేషన్లు లేవు. వాహనాల అమ్మకాలూ లేవు. ఫలితంగా ఖజానా వట్టిపోయింది. ఇంతకుముందు ఎన్నడూలేని స్థాయిలో ఆదాయాలు పడిపోయాయని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

సాధారణంగా ప్రతి నెలా రాష్ట్రానికి సొంత పన్నుల, పన్నేతర ఆదాయం కలిపి రూ.5,500 కోట్ల నుంచి రూ.6,000 కోట్ల వరకూ వస్తుందని అంచనా. పన్నుల రూపంలో నెలకు రూ.5వేల కోట్ల రాబడి ఉంటుంది. ప్రస్తుతం అది అంచనాల్లో కేవలం నాలుగోవంతుకే పరిమితమైంది. కేవలం పన్ను ఆదాయం చూస్తే.. అది ఏప్రిల్‌లో రూ.1,264 కోట్లు, మే నెలలో రూ.1,178 కోట్లు. పన్నేతర ఆదాయం ఏప్రిల్‌లో రూ.58 కోట్లే. మే నెలలో రూ.182 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌ నెల మొత్తానికి, మే నెలకు సంబంధించి నాలుగు రోజుల కిందటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఆదాయాలు ఇలా దక్కాయి.

రిజిస్ట్రేషన్లతో రూ. 45 కోట్లు..
రిజిస్ట్రేషన్ల శాఖకు కరోనా కష్టకాలంలో వచ్చిన ఆదాయం రూ.45 కోట్లు. నిజం చెప్పాలంటే ఇది కూడా మే నెలలోనే వచ్చింది. ఏప్రిల్‌లో నయాపైసా ఆదాయం లేదు. లాక్‌డౌన్‌ పుణ్యమాని రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాధారణంగా వారానికి రూ.100 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఉంటుంది. ఇలా నెలకు రూ.400-500 కోట్ల వరకు రావాల్సిన నిధుల్లో ఇప్పుడు భారీ కోత పడింది.

వాహనాల పన్నూ అంతే
సాధారణంగా ఉగాదికి వాహన రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటుంటాయి. కొత్త మోడల్‌ వచ్చాక వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. మార్చి చివరలో లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆ నెలకు వచ్చిన మొత్తం రూ.178 కోట్లే. ఆ తర్వాత రెండు నెలలూ మరీ ఘోరం. ఏప్రిల్‌లో రూ.35 కోట్లు, మేలో రూ.57 కోట్లు వాహనాలపై పన్ను రూపంలో వచ్చింది. 2 నెలలకూ కలిపినా రూ. 100 కోట్లు దాటకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

అమ్మకపు పన్నే కాస్త మెరుగు

అన్నింటికన్నా అమ్మకపు పన్ను కాస్త ఆశాజనకంగా కనిపించింది. ఏప్రిల్‌లో రూ.793 కోట్లు రాగా, మే నెలలో ఇంతవరకు రూ.593 కోట్లు. ఏప్రిల్‌లో రాష్ట్రానికి ఎక్సైజ్‌ ఆదాయం రూ.4 కోట్లు. మేలో కాస్త మెరుగుపడి రెండు రోజుల కిందటి వరకు రూ.111 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి:

హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.