- ప్రమాదంలో 14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్-లఖ్‌నవూ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ
తుంగభద్ర పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. కరోనా ఆంక్షల మధ్యే పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నదీ స్నానాలు రద్దుచేసి... పూజలు, పిండ ప్రధానాలకు మాత్రమే అనుమతినిచ్చింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలను అనుమతించకూడదు!
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంగా దూకుడుగానే ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలతో కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఎట్టి పరిస్ధితుల్లోనూ స్థానిక ఎన్నికలు జరిపేందుకు అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సివిల్ వివాదాల్ని ‘స్పందన’లో పరిష్కరిస్తారా? : హైకోర్టు
హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వ్యక్తుల అక్రమ నిర్బంధంపై పిటిషనర్, పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసులో శుక్రవారం వాదనలు వినిపించనున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కడలిలో పెరుగుతున్న ఆమ్లశాతం.. రూ. లక్షల కోట్ల సంపదకు ముప్పు
ఆమ్లశాతం పెరుగుదల కారణంగా బంగాళాఖాతంలో జీవావరణం క్రమంగా ముప్పు ముంగిట్లోకి వెళ్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రూ.లక్షల కోట్ల విలువైన సంపద తరిగిపోయే ప్రమాదముందని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం!
కర్ణాటక హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాంను 1,505 మీటర్లకు పెంచుతున్నారు.
- భారత్‌లో 'ముడుపుల' ముప్పు ఎక్కువే
ప్రపంచవ్యాప్తంగా లంచాల కోసం వచ్చే డిమాండ్ల ఆధారంగా తయారు చేసిన ఓ సూచీలో 194 దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చైనాలో 10 లక్షల మందికి కరోనా టీకా
కరోనా నివారణకు టీకా అభివృద్ధి చేసినట్లు గతంలోనే ప్రకటించిన చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ.. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి అందించామని తెలిపింది. టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023కు వాయిదా
మహిళా టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. క్రీడాకారిణులపై ఒత్తిడి తగ్గించడం కోసమే దక్షిణాఫ్రికా వేదికగా 2022లో జరగాల్సిన ఈ టోర్నీని 2023కు మార్చినట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పొరుగు చిలుకలు... తెలుగు పలుకులు
కొత్త కథానాయికలను వెండితెరకు పరిచయం చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అలా తెలుగు చిత్రసీమలో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు తమ సొంత గళంతో డబ్బింగ్ చెప్పుకుని అభిమానులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి