- కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు వివరించారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఏపీ ఈసెట్ 2020: వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఈసెట్-2020లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఉన్నత విద్యా మండలి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు షెడ్యూల్‌ను ప్రకటించింది. అనంతరం అభ్యర్థుల ర్యాంక్ కార్డులను సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆ ఎమ్మెల్యే, ఎంపీ నుంచి మాకు ప్రాణ హాని: వైకాపా నేతల ఆరోపణ
వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు శృంగారపాటి సందీప్, సలివేంద్రం సురేష్ ఆరోపించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నకిలీ జీఎస్టీ బిల్లులతో కేంద్రానికి టోకరా.. వ్యక్తి అరెస్ట్
విజయనగరం జిల్లాకు చెందిన ఓ సంస్థ.. ఘరానా మోసానికి పాల్పడింది. సరకు కొనకుండానే కొనుగోళ్లు జరిగినట్లు 30 కోట్ల రూపాయలకు బిల్లులు సృష్టించారని విశాఖపట్నంలోని జీఎస్టీ నిఘా డైరెక్టర్ జనరల్ కార్యాలయ (డీజీజీఐ) వర్గాలు గుర్తించాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మూడురోజులకే నిలిచిపోయిన సీప్లేన్ సర్వీస్
గుజరాత్లో ఏర్పాటు చేసిన తొలి సీప్లేన్ సర్వీసు.. ప్రారంభమైన మూడురోజులకే నిలిచిపోయింది. అయితే సాధారణ మరమ్మతుల కోసం సర్వీసును నిలిపివేసినట్టు స్పైస్‌జెట్ వెల్లడించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బిహార్ బరి: ఎన్నికల ప్రచారానికి తెర
బిహార్ మూడో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. నవంబర్ 7న 19 జిల్లాల్లోని 78 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి సహా పలువురు మంత్రులు, కీలక నేతలు బరిలో ఉన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఖేలో ఇండియా' పేరుతో అథ్లెట్లకు టోపీ
ఖేలో ఇండియా నకిలీ ప్రకటనతో పలువురు అథ్లెట్లకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. ఒక్కొక్కరి నుంచి రూ.6000 చొప్పున డబ్బు కాజేశారు. దీనిపై భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అధ్యక్ష పోరు: రాష్ట్రాల నిబంధనలతో ఫలితాల్లో తీవ్ర జాప్యం
అమెరికా ఎన్నికల ఫలితాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జాప్యానికి రాష్ట్రాల ఎన్నికల నిబంధనలు కారణమవుతున్నాయి. మరో 5 రాష్ట్రాల్లో ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది.
- స్వల్ప స్కోర్లు నమోదు.. వెలాసిటీ జట్టుదే గెలుపు
మహిళా టీ20 ఛాలెంజ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌పై వెలాసిటీ విజయం సాధించింది. ఈ పోరులో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మెగాహీరోతో లవ్‌ట్రాక్ వార్తల్లో నిజం లేదు: రాశీఖన్నా
మెగా హీరోతో లవ్‌ట్రాక్ నడుపుతుందన్న వార్తల్లో నిజం లేదని చెప్పిన రాశీఖన్నా.. అవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. పరిశ్రమలో తనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి