- రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో అకాల వర్షాలతో తలెత్తిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో పలు మంత్రిత్వ శాఖల అధికారులను భాగస్వామ్యులుగా చేర్చింది. త్వరలోనే ఈ కమిటీ ఏపీలో పర్యటించనుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన
ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగకముందే.. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని
మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నడుచుకోవాలని కొడాలి నాని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పండుగల వేళ ఈ ఉల్లి కష్టాలేల?
పండుగల ముందు సామాన్యులకు ఉల్లి ధరలు భారంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాలలో కిలో ఉల్లి ధర రూ.80-90 మధ్య పలుకుతోంది. కొన్ని మార్కెట్లలో కిలో రూ.100 దాటిన దాఖలాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సైకిల్ ఫర్ ఛేంజ్: అనారోగ్య సమస్యలు, కాలుష్యానికి ఇక చెక్
పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టి మానవుని సగటు ఆయుష్షును పెంచేందుకే కేంద్రం 'సైకిల్ ఫర్ ఛేంజ్' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని చెన్నైలో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చెన్నై మహానగర పాలక సంస్థ ఓ ప్రైవేట్ సంస్థతో జట్టుకట్టింది. నగరవ్యాప్తంగా సైక్లింగ్ లైన్లను ఏర్పాటు చేస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బిహార్ బరి: 'పాటల యుద్ధం'తో సరికొత్త జోష్
బిహార్ ఓటర్లను ఆకర్షించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు రాజకీయ పార్టీలు. ప్రముఖ సింగర్స్‌తో పాటలు పాడించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఒకే వేదికపై ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి
కేరళలోని త్రిస్సూర్‌లోని గురవాయుర్ ఆలయం.. అరుదైన వివాహ వేడుకకు వేదికైంది. ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. 1995లో జన్మించిన ఐదుగురు కవలల్లోని ముగ్గురే వీరు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తేనెటీగల కోసం 'కందిరీగ'లపై అమెరికా యుద్ధం
సాధారణంగా పంటలు బాగా పండాలంటే పరాగ సంపర్కం చాలా అవసరం. ఇందుకు తేనెటీగలు బాగా సహాయపడతాయి. అయితే వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి ఆసియాకు చెందిన విష కందిరీగలు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దూకుడుగా బ్యాటింగ్ చేస్తోన్న కోల్‌కతా
దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటింగ్‌లో వేగం పెంచింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నిలకడగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి
కరోనాతో పోరాడుతున్న హీరో రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ రత్నకిశోర్ వెల్లడించారు. ఆయన్ని వైద్యులు నిరంతం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి