ETV Bharat / city

RAIN ALERT: కోస్తాంధ్ర, సీమ ప్రాంతాలకు వర్ష సూచన.. మత్స్యకారులకు హెచ్చరికలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం(low pressure area News)తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు(India Meteorological Department news) వెల్లడించారు. బలమైన గాలులు వీచే అవకాశముందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరించింది.

RAIN ALERT
RAIN ALERT
author img

By

Published : Nov 16, 2021, 7:02 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతుందని.. భారత వాతావరణ శాఖ వెల్లడించింది(India Meteorological Department news). గురువారం నాటికి దక్షిణకోస్తా - ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం కూడా పలు ప్రాంతాలకు సూచన ఉంటుందన్నారు.

తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. రైతులు ధాన్యం తడిసిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వెల్లడించింది.

తిరుమలలో కాలినడక మార్గాలు మూసివేత

తిరుమల కాలినడక మార్గాలను (Tirumala pedestrian routes) రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు తితిదే (TTD) ప్రకటించింది. 17,18 తేదీల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బుధ, గురువారాల్లో అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలలో భక్తులను అనుమతి నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. గత వారంలో కురిసిన భారీ వర్షాలకు మెట్ల మార్గంలో జలపాతాన్ని తలపించేలా వరద ప్రవహించింది. దీంతో భక్తుల భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు నడక మార్గాలను మూసివేస్తున్నామని తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.

వర్షాల కారణంగా ఈనెల 12, 13 తేదీల్లోనూ రాత్రివేళ కనుమ రహదారులను తితిదే మూసేసింది. 12న రాత్రి 8 గంటల నుంచి 13న ఉ. 4గంటల వరకు మళ్లీ 13న రాత్రి 8 గంటల నుంచి 14న ఉ. 4 గంటల వరకు వాహనాలు అనుమతించలేదు. తిరుమలకు వెళ్లే పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో తితిదే అధికారులు కనుమదారులు మూసివేశారు.

ఇదీ చదవండి:

Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.