పాఠశాలల్లో కేటగిరి- 3, 4 కింద మిగిలిన ఖాళీలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీకి.. జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ జూన్ 15 న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. జీవో 54 లో పేర్కొన్న మార్గదర్శకాలకు, హైకోర్టు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా తాజా కౌన్సెలింగ్ చేపట్టాలని ఆదేశించింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు వేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌన్సెలింగ్‌లో నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తామని హైకోర్టు ఎదుట అడ్వకేట్ జనరల్ హామీని పిటిషనర్లు గుర్తుచేశారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.... కోర్టుకిచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. జూన్ 15న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు.
ఇదీ చదవండి: polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!