ETV Bharat / city

రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న గవర్నర్ - ap governor dishwabhushan on corona vacciene

గవర్నర్ దంపతులు రాజ్ భవన్‌లో రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్​ చెప్పారు.

governor dishwabhushan took second dose corona vaccine
రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న గవర్నర్
author img

By

Published : Mar 31, 2021, 2:40 PM IST

అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సతీమణితో కలిసి.. రాజ్ భవన్‌లో రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్​ను గవర్నర్ తీసుకున్నారు. తొలిదశ టీకా తీసుకున్న తర్వాత జ్వరం, నొప్పి వంటి ప్రతికూల ప్రభావాలు తమకు ఎదురుకాలేదని గవర్నర్ చెప్పారు.

వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేకాక.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరమని స్పష్టం చేశారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తమదైన భూమికను పోషించారని అన్నారు.

ఇదీ చదవండి:

'ఈ - వేలం ద్వారానే తలనీలాలను విక్రయిస్తాం..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.