ETV Bharat / city

AP Crime Report: నేరాల్లో ముందుకు... రాష్ట్రంలో పెరిగిన క్రైం రేటు... - DGP Release Annual Crime Report

DGP Release Annual Crime Report : రాష్ట్రంలో ఈ యేడాది జరిగిన నేరాలపై డీజీపీ గౌతమ్​ సవాంగ్​ వార్షిక నివేదిక విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల రేటు 3శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలు గతేడాది తో పోలిస్తే ఈ యేడాది 21 శాతం పెరగటం కొంత ఆందోళన కలిగిస్తుంది . మరోవైపు సైబర్ నేరాలు ఈయేడాది 18 శాతం తగ్గాయని వార్షిక నివేదికలో డీజీపీ వెల్లడించారు . స్మార్ట్ పోలీసింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందని సవాంగ్ తెలిపారు.

AP Crime Report
రాష్ట్రంలో నేరాలపై వార్షిక నివేదిక విడుదల
author img

By

Published : Dec 28, 2021, 1:56 PM IST

Updated : Dec 28, 2021, 9:01 PM IST

రాష్ట్రంలో నేరాలపై వార్షిక నివేదిక విడుదల

Andhra Pradesh Annual Crime Report: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన నేరాలపై డీజీపీ గౌతమ్​ సవాంగ్​ వార్షిక నివేదిక విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల రేటు 3శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం పెరగటం కొంత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సైబర్ నేరాలు ఈ ఏడాది 18 శాతం తగ్గాయని వార్షిక నివేదికలో డీజీపీ వెల్లడించారు. స్మార్ట్ పోలీసింగ్​లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.

మహిళల పై జరుగుతున్న నేరాలు 21 శాతం, ప్రాపర్టీ అఫెన్సెస్ రేటు 15 శాతం పెరిగాయని తాజా నివేదికలో పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన నేరాల రేటు గతేడాది కన్నా 3 శాతం అధికంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళలు నిర్భయంగా పోలీసు స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేయటమే అధిక కేసుల నమోదుకు కారణమని డీజీపీ చెబుతున్నారు.

ఈ ఏడాది మొత్తం 1,27,127 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మర్డర్ ఫర్ గెయిన్ గతేడాది 29 జరిగితే ఈ ఏడాది 43 జరిగాయన్నారు. దోపిడీలు 246, డెకాయిటీలు 47 జరిగాయని వార్షిక నివేదికలో తెలిపారు. ఈ ఏడాది మొత్తం 1,27,127 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయన్నారు. వీటిలో 90 శాతం ఛార్జ్ షీట్లు వేశామని, 75 శాతం శిక్షలు కూడా పడ్డాయని వివరించారు. 75 అత్యాచారం, 1061 లైంగిక దాడుల కేసుల్లో వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేశామన్నారు. 1,551 మంది పై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు డీజీపీ తెలిపారు. దిశ మొబైల్ యాప్​ను 97 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని .. త్వరలోనే కోటి డౌన్ లోడ్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 40 వేల ఎఫ్​ఐఆర్ లు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో 52 శాతం మంది మహిళలే ఫిర్యాదులు చేశారన్నారు. నేరాల పట్ల మహిళల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు గతేడాది పోలిస్తే శాతం తగ్గటం గమనార్హం.

గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు అడ్డుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 7,226 ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు డీజీపీ వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. లిక్కర్​కు సంబంధించి ఎక్సైజ్ శాఖ 43,293 కేసులు నమోదు చేయగా.. 60 వేల 868 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఈ ఏడాది జాతీయ స్థాయిలో 150 అవార్డ్​లు పోలీసు శాఖకు దక్కటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వంగవీటి రాధా అంశాన్ని పరిశీలిస్తున్నామని ..ఇప్పటికే ఆయనకు గన్ మెన్ లను ఏర్పాటు చేశారన్నారు. రాధా అంశంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఆంక్షలు విధించాయన్నారు. ప్రత్యేక ఆంక్షలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకులేదని డీజీపీ తెలిపారు.

'ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 34,037 మంది పిల్లలకు భద్రత కల్పించాం. 1,63,033 స్పందన పిటిషన్లలో 40,404 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఆపరేషన్ పరివర్తనలో 7,226 ఎకరాల గంజాయి ధ్వంసం చేశాం. 2,762 గంజాయి కేసులు నమోదు చేశాం. మావో ప్రభావిత ప్రాంతాల్లో కూడా గంజాయి ధ్వంసం చేశాం. 43,293 లిక్కర్ కేసులు పెట్టి 60,868 మందిని అరెస్టు చేశాం. లిక్కర్ కేసుల్లో 20,945 వాహనాలు సీజ్ చేశాం' - డీజీపీ గౌతమ్​ సవాంగ్

ఇదీ చదవండి:

CM Jagan On Welfare Schemes: ప్రభుత్వ రాబడి తగ్గినా..సంక్షేమ పథకాలు ఆపలేదు: సీఎం జగన్​

Last Updated : Dec 28, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.