ETV Bharat / city

అమూల్​కు ప్రభుత్వ ప్రచారమా?

ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్​మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించాలని ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Jun 4, 2021, 7:26 AM IST

ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్​మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించాలని ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి రమేశ్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ వ్యవహారంలో స్పష్టత రావాల్సి ఉంది. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ .. ' అమూల్ సంస్థ ఏపీలో వ్యాపారం చేయకూడదని మేం కోరడం లేదు. అమూల్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ధనం, వనరులను వినియోగించడమే అభ్యంతరకరం. ప్రభుత్వ సొమ్మును, ఉద్యోగులను అమూల్ కోసం వినియోగించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించండి. అమూల్ సంస్థకు పాలు పోయకపోతే సంక్షేమ పథకాలు నిలివేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును అమూల్ అవసరాలకు ఖర్చు చేయకుండా నిలువరించడండి ' అని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ రికార్డుల్లోకి చేరలేదని గుర్తు చేసిన ధర్మాసనం .. అమూల్ కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ అభ్యంతరం తెలిపారు. ఎంపీ వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినట్లు గతంలో చెప్పినా... ఆ దస్త్రం రిజిస్ట్రీకి చేరలేదని ధర్మాసనం గుర్తుచేసింది. ఏజీ కార్యాలయం పనిచేసేది ఇలాగేనా అని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: లేఖలు రాస్తే వ్యాక్సిన్ వస్తుందా ముఖ్యమంత్రి గారూ!: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.