ETV Bharat / city

సుప్రీంలో అమరావతి భూముల కేసు విచారణ.. ఏప్రిల్​ 7కు వాయిదా - సుప్రీంకోర్టులో అమరావతి భూముల కేసు విచారణ తాజా వార్తలు

అమరావతి భూములపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. కేబినెట్ సబ్‌కమిటీ, సిట్‌పై హైకోర్టు స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సమయాభావం వల్ల వాయిదా వేసినట్లు జస్టిస్ అశోక్ భూషణ్ వెల్లడించారు.

Amravati land case hearing in the Supreme Court
సుప్రీంలో అమరావతి భూముల కేసు విచారణ
author img

By

Published : Mar 5, 2021, 2:54 PM IST

అమరావతి భూములపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సమయాభావం వల్ల వాయిదా వేసినట్లు జస్టిస్ అశోక్ భూషణ్ వెల్లడించారు. కేబినెట్ సబ్‌కమిటీ, సిట్​‌పై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు చేస్తామని.. ప్రతివాదుల అఫిడవిట్‌పై ప్రభుత్వం తరుపు న్యాయవాది అభిప్రాయాన్ని తెలిపారు. సీబీఐతో విచారణకు తమకు అభ్యంతరం లేదని రాజీవ్ ధావన్ స్పష్టం చేశారు. అయితే అంశాలన్నీ తదుపరి విచారణలోనే పరిశీలిస్తామని జస్టిస్ అశోక్ భూషణ్ వెల్లడించారు.

దమ్మాలపాటి పిటిషన్‌నూ అప్పుడే విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తదుపరి విచారణ రోజు అభ్యర్థన పరిశీలిస్తామన్న ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.