మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నేటి కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అదే సమయానికి వెలగపూడి, మందడంలో రైతులు ధర్నా నిర్వహించనున్నారు. తుళ్లూరులో మహాధర్నా కొనసాగించనున్నారు. వీరితోపాటు 'చలో హైకోర్టు' పేరుతో న్యాయవాదులు ఆందోళనకు దిగనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రాజధాని రైతులు భేటీ కానున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించనున్నారు. గవర్నర్‌తో భేటీకి సమయం కోరారు.
ఇదీ చదవండి:తుళ్లూరులో నిరసనల హోరు...!