పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు 362వ రోజు ఆందోళన చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.
ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ వెంకటపాలెంలో మహిళలు వన దేవతలకు మోకాళ్లపై కూర్చొని పూజలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు దీక్షా శిబిరాలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మరో నాలుగు రోజుల్లో తమ ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని మహిళలు దుయ్యబట్టారు. అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకోకపోతే వైకాపా అధికారంలో ఉన్నన్ని రోజులు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి