దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం జరుగుతోందని.... అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. దిల్లీ ఉద్యమానికి మద్దతుగా వెళ్లిన అమరావతి రైతులు.. ప్రభుత్వాలు అన్నదాతలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని మండిపడ్డారు. దిల్లీలోని రైతులను కలవడానికి వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుంకులు సృష్టించారని అన్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని దిల్లీ రైతులను కోరామని తెలిపారు. రాజధాని ఉద్యమాన్ని నలువైపులా విస్తరిస్తామని అమరావతి జేఏసీ ప్రతినిధి రాయపాటి శైలజ, యూత్ ఫర్ ఏపీ ప్రతినిధి వేదవతి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ జోక్యం చేసుకున్నా పరిష్కారం కాలేదు.. ఎంటా సమస్య..?