అమ్మఒడి లబ్ధికాదారుల ఎంపిక ప్రక్రియను డిసెంబర్ 24 లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వలు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికకు నిర్దేశిత సమయంలోపు చేపట్టాల్సిన కార్యకలాపాలను వెల్లడించింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు 19వ తేదీ వరకూ సమయం ఇచ్చారు. విద్యార్థుల వివరాలతో పాటు తల్లి బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది.
ఇదీ చదవండి: నవ్యాంధ్రలో పెట్టుబడులకు డజను దిగ్గజ సంస్థల ఆసక్తి