అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 332వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, నీరుకొండ, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం, అనంతవరం, పెదపరిమి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. జై అమరావతి అంటూ దీక్షాశిబిరాల వద్ద రైతులు, మహిళలు నినాదాలు చేశారు. ఉద్ధండరాయుని పాలెంలో మహిళలు, రైతులు తలపై కండువాలు వేసుకొని నిరసన తెలిపారు. విజయవాడలో ఐకాస నేతలపై పోలీసులు కేసులను పెట్టడాన్ని అమరావతి రైతులు తప్పుపట్టారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసుల మాదిరిగానే న్యాయస్థానంతో ప్రభుత్వం మరోసారి తలంటించుకుంటుదని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి