ETV Bharat / city

అన్ని ప్రాంతాలకు అమరావతి మాస్కులు - amaravathi masks distribution

అమరావతికి మద్దతుగా రాజధాని రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 104 రోజులకు చేరుకున్నాయి. కరోనా కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో అమరావతి నినాదంతో పాటు కరోనా నియంత్రణపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు రైతులు నిమగ్నమయ్యారు. ఆకుపచ్చని వస్త్రంతో మాస్కులు కుట్టి వాటిపై ‘జై అమరావతి' అని రాసి అన్ని ప్రాంతాలకు పంపనున్నారు.

అన్ని ప్రాంతాలకు అమరావతి మాస్కులు
అన్ని ప్రాంతాలకు అమరావతి మాస్కులు
author img

By

Published : Mar 30, 2020, 8:23 AM IST

అమరావతికి మద్దతుగా రాజధాని రైతులు లాక్‌డౌన్‌లోనూ నిరసన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. నేటితో నిరసనలు 104వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి సాధనతో పాటు కరోనా నియంత్రణపైనా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని రైతులు నిర్ణయించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళలు క్రియాశీలంగా వ్యవహరించారని, ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల తయారీలోనూ కీలకం కావాలని సూచించారు. ఆకుపచ్చని వస్త్రంతో మాస్కులు కుట్టి వాటిపై 'జై అమరావతి' అని రాసి అన్ని ప్రాంతాలకు పంపనున్నారు. తద్వారా రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

స్థానిక శివాలయంలో దీక్షలు

మందడంలో పలువురు ఎస్టీలు తమ ఇళ్లల్లో పిల్లలతో పాటు నిరసనలో పాల్గొన్నారు. పెదపరిమిలో దీక్షా శిబిరంలో రైతులు నిరసన తెలిపారు. స్థానిక శివాలయంలో మహిళలు దీక్షలు కొనసాగించారు. అనంతవరంలో మహిళలు ఓ ఇంటి వద్ద నినాదాలు చేశారు. తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, అబ్బురాజుపాలెం తదితర రాజధాని గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని ఇళ్ల వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో రాత్రి ఏడింటికి ఇళ్లలోని విద్యుత్‌ దీపాలను కొద్ది సేపు ఆపి కొవ్వొత్తుల వెలుగులో నిరసన తెలిపారు. తుళ్లూరు కొత్తూరులోని గ్రంథాలయం కూడలి వద్ద ఉన్న గృహాలలో ఉండే రైతులు, మహిళలు తమ నిరసనలు కొనసాగించారు.

ఇదీ చూడండి: కొవ్వొత్తులతో అమరావతి రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.