రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు.. 558వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, నెక్కల్లు, బోరుపాలెంలో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దీక్షా శిబిరాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇన్నాళ్లు ఇంటి నుంచే ఆందోళనలు చేసిన రైతులు, మహిళలు.. దీక్షా శిబిరాల నుంచే నిరసనలు తెలియజేస్తున్నారు. సీఎంకు పరిపాలన అనుభవం లేకపోవడం వల్లే ఏపీ నుంచి ఒక్కో పరిశ్రమ తరలివెళ్లిపోతోందని రైతులు విమర్శించారు.
ఇదీ చదవండి