ETV Bharat / city

Amaravathi Farmers: ప్రభంజనంలా మహాపాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశం - guntur district news

గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి రైతుల ఆరో రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ఈరోజు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. మహా పాదయాత్రకు ప్రకాశం జిల్లా నేతలు, రైతులు సాదర స్వాగతం పలికారు. మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు గ్రామస్థులు బూట్లు, గొడుగులు అందించారు.

ఆరో రోజు ప్రారంభమైన రైతుల పాదయాత్ర
ఆరో రోజు ప్రారంభమైన రైతుల పాదయాత్ర
author img

By

Published : Nov 6, 2021, 9:32 AM IST

Updated : Nov 6, 2021, 5:31 PM IST

ప్రకాశం జిల్లాలోకి ప్రవేసించిన మహాపాదయాత్రకు స్థానికుల ఘన స్వాగతం

రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ఆరో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఈరోజు 14 కి.మీ. మేర రైతుల పాదయాత్ర సాగనుంది.

పాదపూజ..
రాజధాని కోసం వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు.. నాగులపాడు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, గ్రామస్థులు పాదపూజ చేశారు. రైతుల పాదాలపై పూలు చల్లి పూజ జరిపారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఇబ్బంది లేకుండా నడిచేందుకు 150 మంది రైతులకు బూట్లు, గొడుగులు అందజేశారు. ప్రజలు చూపించిన ఈ అభిమానంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

కృష్ణాజిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.. రాజధాని రైతులకు మద్దతు కోసం బయలుదేరి వెళ్లారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

7 వేల మందికి భోజన ఏర్పాట్లు..
అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. ప్రకాశం జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దులకు.. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. పాదయాత్రగా వస్తున్న రైతులు, సంఘీభావంగా వచ్చే వారి కోసం.. 7వేలమంది అడుసుమల్లిలో భోజన ఏర్పాట్లుచేస్తున్నారు. రైతుల పాదయాత్ర తిరుపతి వరకూ ఇలాగే కొనసాగాలని అడుసుమల్లి గ్రామాస్తులు ఆకాంక్షించారు.

ఆరో రోజు..'న్యాయస్థానం-దేవస్థానం' మహాపాదయాత్ర

ప్రకాశం జిల్లాలో యాత్ర ఇలా..
అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థాననం మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 12 రోజులపాటు యాత్ర సాగుతుంది. మరో రెండు రోజులు విశ్రాంతి కోసం మార్గంమధ్యలో రైతులు ఆగనున్నారు. పర్చూరు మండలం చిన నందపాడులో మహాయాత్ర ప్రవేశించింది. తొలిరోజు చిననందిపాడు నుంచి అడుసుమల్లి, పర్చూరు వరకు యాత్ర ఉంటుంది.

జిల్లాలో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, గుడ్లూరు తదితర మండలాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. 19న నెల్లూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాజధాని అమరావతికి మద్దతుగా చేస్తున్న యాత్రకు ఇప్పటికే పలు సంఘాలు, రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ పట్టణ తెదేపా కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి నరసరావుపేట రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. మహా పాదయాత్రలో భాగమయ్యారు.

రాష్ట్రానికి ఆదాయం తెచ్చే రాజధానిని సర్వ నాశనం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని జీవీ విమర్శించారు. త్వరలోనే తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతుగా రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

డిసెంబర్​ 15న తిరుమలకు..
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ పాదయాత్ర 45 రోజులపాటు సాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రాజధాని రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

DRDA SCHEME CANCELLED: ఏప్రిల్‌ నుంచి డీఆర్‌డీఏ పథకం రద్దు

Last Updated : Nov 6, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.