ETV Bharat / city

Amaravati farmers: ఎంపీ విజయసాయి వ్యాఖలను నిరసిస్తూ.. రాజధాని రైతుల ఆందోళన

author img

By

Published : Jun 3, 2021, 4:47 PM IST

విశాఖ ఎంపీ విజయసాయి వ్యాఖ్యలను నిరసిస్తూ.. అమరావతి రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని అంశం న్యాయస్థానంలో ఉండగా.. దానిపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

amaravathi farmers protest
amaravathi farmers protest

పరిపాలన రాజధాని (executive capital)ని విశాఖకు తరలిస్తామన్న ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశం న్యాయస్థానంలో ఉండగా..దానిపై ఎలా మాట్లాడతారని రైతులు నిలదీశారు. తామంతా సీఆర్డీఏతో అగ్రిమెంట్ చేసుకొని భూములిచ్చామని..ముందు ఆ అంశం తేల్చాలని డిమాండ్ చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన వైకాపా నేతలు ఎక్కడున్నారని రైతులు, మహిళలు ప్రశ్నించారు. బెయిల్​పై బయట ఉన్న వ్యక్తి న్యాయస్థానాన్ని ధిక్కరించి మాట్లాడుతుంటే సీఐడీ(CID) ఏం చేస్తుందన్నారు. ఇది రాజద్రోహం కిందకు రాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తోన్న నిరసనలు 534వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, మోతడక గ్రామాల్లో రైతులు నిరసనలు తెలిపారు.

ఇదీ చదవండి: AP Executive Capital: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతాం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.