గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఈనెల 6న తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు రైతులు వచ్చి ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారి పేర్లను స్పష్టంగా రాయాలని చెప్పారు. దీనికి తాము అభ్యంతరం తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు. దాడికి పాల్పడింది ఎవరో తమకు తెలియదని సమాధానమిచ్చారు.
దాడికి సంబంధించిన వీడియో, ఫొటోలు ఇస్తామని చెప్పినా... పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని రైతులు వాపోయారు. గతంలో ధర్నాలో పాల్గొన్న సమయంలో తమపై ఫొటోల ఆధారంగా కేసులు పెట్టలేదా..? అని రైతులు గుర్తుచేసినా.. పోలీసులు అవేవి తమకు తెలియదన్నారని రైతులు చెప్పారు.
ఇదీ చదవండీ... ఉద్దండరాయునిపాలెం వద్ద ఉద్రిక్తత.. రైతులను అడ్డుకున్న పోలీసులు