పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. రైతులు, మహిళలు నిర్వహించిన ఆందోళన 472వ రోజుకి చేరింది. ప్రత్యేక హోదా పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్వప్రయోజనాల కోసం ప్రధాని మోదీ కాళ్ల వద్ద హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న ముఖ్యమంత్రి.. ఇపుడు కేంద్రం ముందు ఎందుకు మెడలు వంచారని నిలదీశారు.
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, బోరుపాలెంలో నిరసన దీక్షలు కొనసాగాయి. పుదుచ్చేరికి సాధ్యమైన ప్రత్యేక హోదా.. రాష్ట్రానికి ఎందుకు రాదని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం అనుమతి తర్వాతే హోదాపై ప్రకటన చేశారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: