రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షలు 150వ రోజు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు, మహిళలు భౌతిక దూరం పాటిస్తూనే తమ నిరసనలు తెలుపుతున్నారు. రైతులు, మహిళలు ఇళ్లల్లోనే దీక్షలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు దీక్షలు కొనసాగనున్నాయి.
తుళ్లూరు మండలం మందడం, దొండపాడు, వెంకటపాలెం, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి గ్రామాలలో రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరిస్తే తాము అదే ధోరణిలో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు తెలిపారు. లాక్డౌన్ అనంతరం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి : రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్