అమరావతి ఉద్యమం ఈ నెల నాలుగో తేదీకి 200వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో మహాదీక్ష చేపడుతున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోని 200 నగరాల్లో మహాదీక్ష జరగనుందని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరోనా నిబంధనల ప్రకారం ఎవరి ఇంట్లో వాళ్లు నిరసన తెలియజేస్తారని తెలిపారు.
వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు జులై ఉదయం 11 గంటల నుంచి వీడియో సందేశాల ద్వారా తమ సంఘీభావం ప్రకటిస్తారన్నారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 68 మంది రైతులు, రైతు కూలీలు నివాళులర్పించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖలో హైఎండ్ ఐటీ స్కిల్ వర్సిటీ: సీఎం జగన్