ETV Bharat / city

పురోగతికి రాజమార్గం.. ఆగిపోయే ప్రమాదం! - amaravath development news

అమరావతి రాజధాని తరలింపు ప్రతిపాదనతో మరో వేలకోట్ల రూపాయల ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమైంది. అమరావతి నగరనికి కంఠాభరణంగా, పురోగతికి రాజమార్గంగా...17 వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ఔటర్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

amaravathi outer ring road
amaravathi outer ring road
author img

By

Published : Jan 17, 2020, 6:26 AM IST

Updated : Jan 17, 2020, 12:25 PM IST

పురోగతికి రాజమార్గం.. ఆగిపోయే ప్రమాదం!

రాజధాని ప్రాంతంలో 89 కిలోమీటర్ల పొడవైన బాహ్యవలయ రహదారి నిర్మాణానికి నిధులిచ్చేందుకు కేంద్రం కూడా ముందుకొచ్చింది. డీపీఆర్ కూడా సిద్ధమైంది. అవసరమైన భూములు సమీకరించి అప్పగిస్తే పనులు ప్రారంభించేదుకు.. జాతీయ రహదారుల సంస్థ సిద్ధంగా ఉంది. ఈ దశలో రాజధానిని తరలిస్తే ఔటర్‌ అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకున్నట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా...నగర ప్రణాళికల్లో బాహ్యవలయ రహదారులదే కీలక పాత్ర. విభజన రూపేణా..... మనం కోల్పోయిన హైదరాబాద్‌ మహానగరానికీ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఒక మణిహారమే కాదు.. పురోగతికి రాజమార్గం కూడా! 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ అభివృద్ధి బాహ్యవలయ రహదారికి ముందు ఒక ఎత్తు, తర్వాత మరో ఎత్తు అని చెప్తారు. ఓఆర్​ఆర్​ నిర్మించాక భాగ్యనగరం కూడా వేగంగా విస్తరించింది. అందుకే అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను నాటి ప్రభుత్వం నగర నిర్మాణానికే పరిమితం చేయలేదు. అమరావతిని సమీపంలోని విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లితో కలిపి మహానగరంగా అభివృద్ధి చేసేందుకు అంకుర దశలోనే ఔటర్‌ రింగ్‌రోడ్‌ను ప్రతిపాదించింది.

ఔటర్ రింగ్ రోడ్.. ఫర్ న్యూ కేపిటల్ సిటీ !
కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని పలు నగరాలు, ఊళ్ల చుట్టూ 189 కిలోమీటర్ల పొడవున రింగ్‌రోడ్‌ నిర్మించాలని ప్రణాళికలు రచించారు. 17 వేల 761 కోట్ల రూపాయలు కావాలని అంచనావేశారు. 3 వేల404 హెక్టార్ల భూమి అవసరమని .. దీనికి 4 వేల 198 కోట్ల రూపాయలు అవసరమని లెక్కగట్టారు. లోటుబడ్జెట్‌లో ఉన్న నవ్యాంధ్రపై ఆ భారం పడకుండా.... కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వ శాఖ అప్పట్లో అమరావతి ఔటర్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్.. ఫర్ న్యూ కేపిటల్ సిటీ అని నామకరణం కూడా చేశారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని పలు జాతీయ,రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను కలుపుతూ... 87 గ్రామాల మీదుగా వెళ్లేలా ఔటర్‌కు రూపకల్పన చేశారు.

అప్పటి నుంచి ముందుకు కదల్లేదు
విజయవాడ- హైదరాబాద్ 65వ నంబర్‌ జాతీయ రహదారిపై కంచికచర్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మొదలై.. కోల్ కతా- చెన్నై 16వ నంబర్‌ జాతీయ రహదారిపై గుంటూరు వెలుపలున్న పొత్తూరు వద్ద కలుస్తుంది. ఇందులో భాగంగా అమరావతి ఆలయానికి సమీపంలో ఒక వంతెన, తోట్ల వల్లూరు వద్ద మరో వంతెన కృష్ణానదిపై నిర్మించాలని నిర్ణయించారు. 150 మీటర్ల వెడల్పుతో ఔటర్‌ నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలని భావించారు. మొదట 4 వరుసలుగా నిర్మించి.. భవిష్యత్‌లో వాహన రద్దీకి అనుగుణంగా వరుసలు పెంచేలా ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధమని జాతీయ రహదారుల సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసింది. అయితే.. భూమిని సేకరించాలా? లేదంటే రాజధాని తరహాలోనే సమీకరించాలా ?అని గత ప్రభుత్వం ఆలోచన చేసింది. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారటంతో భూ సమీకరణ ప్రక్రియ ముందుకి వెళ్లలేదు. ఇప్పుడు రాజధానినే ఇక్కడి నుంచి తరలిస్తే 17 వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టును చూస్తూ చూస్తూ వదులుకున్నట్టవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అమరావతితో అనుసంధానత పెరిగేది

అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌ కార్యరూపం దాల్చితే రింగు రోడ్డు లోపలతోపాటు వెలుపల కూడా నలుచెరుగులా కొన్ని కిలోమీటర్ల మేర అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి సమీపంలోనే ఉండటంతో గత నాలుగున్నరేళ్లలో ఈ ప్రాంతంలో ఓ గ్రోత్ కారిడార్ అభివృద్ధి చెందింది. విపరీతంగా నిర్మాణాలు జరిగాయి. ఓఆర్​ఆర్​ సాక్షాత్కరిస్తే ఎన్నో చిన్న పట్టణాలకు అనుసంధానత పెరిగేది. గుంటుపల్లి , నున్న , గన్నవరం , పెదవడ్లపూడి, పెదకాకాని , పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్‌గా.. మైలవరం , ఆగిరిపల్లి , పెదఆవుటుపల్లి , నేపల్లె , నందివెలుగు, వేజెండ్ల , పేరేచర్ల... కంచికచర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేశారు. 17 శాటిలైట్ టౌన్‌ఫిప్‌లకు శ్రీకారం చుట్టాలనే ప్రతిపాదనలూ చేశారు. ఓఆర్ఆర్ లోపలా , వెలుపలా ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధికీ లెక్కలేనన్ని అవకాశాలుండేవి. జాతీయ, రాష్ట్రరహదారుల్నిఅనుసంధానిస్తూ డీపీఆర్​ సిద్ధం చేసినందున.. పొరుగు రాష్ట్రాలకూ అమరావతితో అనుసంధానత పెరిగేది. విశాఖ- హైదరాబాద్ ట్రాఫిక్.. విజయవాడకు రావలసిన అవసరం లేకుండా ఓఆర్ఆర్ మీదుగా సాగే వీలుండేది. ప్రతిపాదిత మచిలీపట్నం , నిజాంపట్నం పోర్టులు అమరావతికి..చెరోవైపున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గడ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాల నుంచి పోర్టులకు వచ్చి వెళ్లే వాహనాలకు సులభంగా ఉండేది.

అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా..
ప్రతిపాదిత బాహ్యవలయ రహదారికి లోపలున్న పెద్ద నగరం విజయవాడ. అది రవాణా , విద్య , పర్యాటక , ఆధ్యాత్మిక రంగాల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. మిర్చి , పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు ప్రధాన మార్కెటింగ్ కేంద్రంగా ఉన్న గుంటూరు కూడా వాణిజ్యంలో మరో మెట్టు ఎక్కేదని నిపుణుల అభిప్రాయం. ఇక తెనాలి నుంచి ధాన్యం , బియ్యం , మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహకంగా ఉండేది. చేనేత వస్త్రాలకూ ప్రసిద్ధి చెందిన మంగళగిరి పర్యాటకంగానూ అభివృద్ధి చెందేది. గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లో కీలకమైన ఆక్వా , ఆహారశుద్ధి పరిశ్రమలకు ఆలవాలంగా ఉండేది. నూజివీడు మామిడి ఎగుమతులు.. మామిడి ఆధారిత పరిశ్రమలతో విస్తృతంగా అభివృద్ధి చెందే అవకాశముంది. కొండపల్లి , నందిగామ జగ్గయ్యపేట విద్యుత్ , సిమెంట్ , ఫార్మా , ప్లాస్టిక్, రసాయన పరిశ్రమలకు... ఆలవాలంగా మారేందుకూ అవకాశముందని అభిప్రాయం. గుంటూరు- చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్న పొన్నూరు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే వీలుంది. గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తెనపల్లి ప్రధాన వాణిజ్య హబ్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో రకరకాల క్లస్టర్ల ఏర్పాటుకు ఓటర్‌ రింగ్‌రోడ్‌ రాజమార్గంగా నిలిచేది.

పారిశ్రామికీకరణ వేగవంతమయ్యేది!
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 10 మండలాల్లో.. ఆర్థికాభివృద్ధికి ఔటర్‌రింగ్‌రోడ్‌ ఆలంబనగా నిలేచేది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అవకాశమున్న ప్రాంతాలుగా తోట్లవల్లూరు, మైలవరం, గన్నవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, జె .కొండూరు, పొన్నూరు, కొల్లిపర, అమరావతి, కొల్లూరు, సత్తెనపల్లి, పెదకూరపాడును అప్పట్లో గుర్తించారు. విజయవాడ , గుంటూరు , తెనాలి , మంగళగిరి , సత్తెనపల్లి , పెదకాకాని సేవారంగంలో మరింతదూసుకెళ్లేవి. విజయవాడ , గుంటూరు , యడ్లపాడు , పెనమలూరు ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ వేగవంతానికి ఓఆర్​ఆర్​ దోహదం చేసేది. ఇక కృష్ణా జిల్లా ఆగిరిపల్లి , మైలవరం ప్రాంతాల్లో మామిడి, జామ, గుంటూరు జిల్లా అమరావతి, పెదకూరపాడు , మేడికొండూరు , సత్తెనపల్లి , యడ్లపాడు ప్రాంతాల్లో మిరప సాగు అధికం. తెనాలి ప్రాంతంలో... పండ్లు, కూరగాయల తోటలు ఎక్కువ. ఓఆర్​ఆర్​ సాకారమైతే.. ఆయా ప్రాంతాల్లో పంట దిగుబడుల రవాణా సులభం అయ్యేది.

ఇప్పుడు అయోమయం

ప్రతిపాదిత అమరావతి బాహ్యవలయ రహదారి.. పలు రాష్ట్ర, జాతీయ రహదారులను కలుపుతుంది. సత్తెనపల్లి- హైదరాబాద్.. నరసరావుపేట –బెంగళూరు, చెన్నై-కోల్‌కతా, వాడరేవు- నరసరావుపేట, బాపట్ల- గుంటూరు, విజయవాడ- కాకినాడ, విజయవాడ-గుడివాడ, విజయవాడ- నూజివీడు, విజయవాడ- రాయపూర్, విజయవాడ- హైదరాబాద్..... మార్గాలను కలుస్తుంది. కృష్ణాజిల్లా పొట్టిపాడు వరకూ వెళ్లే బాహ్యలయల రహదారి.. విశాఖపట్నానికి 321 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కంచికచర్ల నుంచి చూస్తే హైదరాబాద్‌కు 200, సత్తెనపల్లి నుంచి 237 కిలోమీటర్లు మైలవరం నుంచి ఖమ్మం జిల్లాకు.. 107 కిలోమీటర్ల దూరంలో ఔటర్‌ ఉంటుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి తలమానికంగా నిలిచే ఈ ప్రాజెక్టు ఇప్పుడు రాజధాని తరలింపు ప్రకటనతో అయోమయంలో పడింది.

ఇదీ చదవండి:భాజపా, జనసేన ఐక్యగళం- అమరావతి నుంచే తొలి ఉద్యమం

Intro:Body:Conclusion:
Last Updated : Jan 17, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.