ETV Bharat / city

తిరుపతిలో ముగిసిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

amaravathi mahasabha live page
అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ
author img

By

Published : Dec 17, 2021, 8:25 AM IST

Updated : Dec 17, 2021, 6:08 PM IST

17:48 December 17

మడమ తిప్పనన్న జగన్‌.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు?: చంద్రబాబు

  • సభావేదికపై జై అమరావతి.. నినాదాలు చేసిన చంద్రబాబు
  • అమరావతి ఉద్యమంలో 180 మంది చనిపోయారు: చంద్రబాబు
  • అమరావతి ఉద్యమకారులు 2,500 మందిపై కేసు పెట్టారు: చంద్రబాబు
  • ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టిన ప్రభుత్వం ఇది: చంద్రబాబు
  • అమరావతి రైతులు చేసిన పాపం ఏమిటి?: చంద్రబాబు
  • హైదరాబాద్‌ అనుభవం ఉందని చెప్పి భూమి తీసుకున్నాం: చంద్రబాబు
  • అమరావతి ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతిచ్చాయి: చంద్రబాబు
  • అమరావతి ఉద్యమానికి.. భాజపా, జనసేన మద్దతిచ్చాయి: చంద్రబాబు
  • ఎన్నికల ముందు ఏం చెప్పారో జగన్ గుర్తు తెచ్చుకోవాలి: చంద్రబాబు
  • మడమ తిప్పనన్న జగన్‌.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు?: చంద్రబాబు
  • అమరావతిపై కుల ముద్ర వేస్తున్నారు: చంద్రబాబు
  • ఈ వేదికపై ఉన్న అందరిదీ ఏ కులమో చెప్పాలి: చంద్రబాబు
  • జగన్‌.. ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు: చంద్రబాబు
  • అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని..: చంద్రబాబు
  • రాజధానిపై జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారు: చంద్రబాబు
  • అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు: చంద్రబాబు
  • అమరావతి గట్టి నేల కాదని ప్రచారం చేశారు: చంద్రబాబు
  • మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా?: చంద్రబాబు
  • ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది: చంద్రబాబు
  • ధర్మ పోరాటంలో అంతిమ విజయం అమరావతిదే: చంద్రబాబు
  • రాజధాని నిర్మాణానికి నిధులు లేవని జగన్ అంటున్నారు: చంద్రబాబు
  • అమరావతి భూములతోనే ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు: చంద్రబాబు
  • అమరావతిపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం: చంద్రబాబు
  • అమరావతిని కాపాడుకునే బాధ్యత.. 5 కోట్ల ప్రజలదే: చంద్రబాబు
  • అమరావతిని కాపాడుకుందాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం..: చంద్రబాబు
  • ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అదే అమరావతి: చంద్రబాబు
  • అమరావతి రైతుల త్యాగానికి పాదాభివందనం: చంద్రబాబు

17:44 December 17

ఏపీలో ఉన్నది జగన్ రాజ్యం కాదు.. ఝరాసంధుడి రాజ్యం: కాషాయ స్వామి

  • ఏపీలో ఉన్నది జగన్ రాజ్యం కాదు.. ఝరాసంధుడి రాజ్యం..: కాషాయ స్వామి
  • జగన్ పాలన.. ధర్మంపై విధ్వంసం.. న్యాయంపై విధ్వంసం: కాషాయ స్వామి
  • జగన్‌ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి:కాషాయ స్వామి

17:37 December 17

అమరావతి అనే శిశువును జగన్ మూడు ముక్కలు చేశారు: నారాయణ

  • రాజధానిపై సీపీఐ ఎప్పుడూ మాట మార్చలేదు: నారాయణ
  • అమరావతి అనే శిశువును జగన్ 3 ముక్కలు చేశారు: నారాయణ
  • జగన్‌ లాంటి మూర్ఖుడు.. మరొకరు ఉండరు: నారాయణ
  • మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: నారాయణ
  • ఉత్తరాదికి వెళ్తే మీ రాష్ట్ర రాజధాని ఏదని అడుగుతున్నారు: నారాయణ
  • రాజధాని ఏదంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు: నారాయణ
  • స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదే: నారాయణ
  • రాజధాని అంటేనే అమరావతి రైతులు భూమి ఇచ్చారు: నారాయణ

17:32 December 17

అమరావతి రాజధాని అనే కేంద్రం అనేక విధాలుగా సాయం చేసింది: కన్నా

  • అమరావతికి అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతిచ్చాయి: కన్నా
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు: కన్నా
  • అమరావతి రాజధాని అనే కేంద్రం అనేక విధాలుగా సాయం చేసింది: కన్నా
  • అమరావతిలో అనేక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చింది: కన్నా
  • ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చారు: కన్నా
  • దోచుకునేందుకు ఏమీ లేదనే అమరావతిని వద్దంటున్నారు: కన్నా
  • విశాఖను దోచుకునేందుకే అక్కడ రాజధాని అంటున్నారు: కన్నా
  • రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు వణుకుతున్నారు: కన్నా
  • వైకాపా ప్రభుత్వ విధానం దోపిడీయే.. అభివృద్ధి కాదు: కన్నా
  • జగన్‌ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు: కన్నా
  • అమరావతి ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని అమిత్‌ షా అడిగారు: కన్నా
  • అమిత్ షా పిలుపుతో మరింత ఉత్సాహంగా పాల్గొంటున్నాం: కన్నా

17:31 December 17

జగన్ రోడ్లపై తిరిగితే 3 రాజధానులు వద్దని ఆయనే అంటారు: తులసిరెడ్డి

  • అమరావతి పోరు.. ప్రపంచ చరిత్రలోనే అపూర్వం, అద్భుతం, అమోఘం: తులసిరెడ్డి
  • అలుపెరగకుండా పోరాడుతున్న అమరావతి రైతులకు సెల్యూట్‌: తులసిరెడ్డి
  • ఒక రాజధానితోనూ అధికార వికేంద్రీకరణ సాధ్యమే: తులసిరెడ్డి
  • 3 ప్రాంతాలనూ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత.. జగన్‌దే: తులసిరెడ్డి
  • రూ.5 వేల కోట్లతోనే అమరావతిని అభివృద్ధి చేయవచ్చు: తులసిరెడ్డి
  • రాజధాని అమరావతి.. రాష్ట్రానికి కల్పవృక్షం: తులసిరెడ్డి
  • అమరావతిలోని 9 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉంది: తులసిరెడ్డి
  • రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే రూ.వేల కోట్ల ఆదాయం వచ్చేది: తులసిరెడ్డి
  • జగన్ రోడ్లపై తిరిగితే 3 రాజధానులు వద్దని ఆయనే అంటారు: తులసిరెడ్డి
  • అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడితే కేంద్రంతో పోరాడి హోదా తేవాలి: తులసిరెడ్డి

17:31 December 17

జగన్ మాటతప్పి సీమకే మచ్చ తెచ్చారు: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

  • జగన్ మాటతప్పి సీమకే మచ్చ తెచ్చారు: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
  • 30 రాజధానులు కడతామని పెద్దిరెడ్డి అంటున్నారు: కిశోర్‌కుమార్‌రెడ్డి

17:30 December 17

జగన్‌ విధ్వంసం నేర్పారు: పులవర్తి నాని

చంద్రబాబు నిర్మించడం నేర్పారు.. జగన్‌ విధ్వంసం నేర్పారు: పులవర్తి నాని

16:59 December 17

వైకాపా తప్ప మిగతా పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుతున్నాయి: రామకృష్ణ

  • వైకాపా తప్ప అన్ని పార్టీలూ అమరావతినే రాజధానిగా కోరుతున్నాయి: రామకృష్ణ
  • జగన్.. రెండేళ్లుగా నిప్పుల కుంపటి రాజేశారు: రామకృష్ణ
  • తిరుపతి సభకు వస్తుంటే అడ్డుకున్నారు: రామకృష్ణ
  • అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు తప్పుడు కేసులు పెట్టించారు: రామకృష్ణ
  • అమరావతి ఉద్యమకారులను జైళ్లలో పెట్టించారు: రామకృష్ణ
  • ప్రాంతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారు: రామకృష్ణ
  • రాజధానిపై జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారు: రామకృష్ణ
  • అమరావతి ఉద్యమానికి భాజపా రాష్ట్ర నేతల మద్దతు: రామకృష్ణ
  • అమిత్ షా ఒక్క ఫోన్ చేస్తే జగన్‌ శిరసావహిస్తారు: రామకృష్ణ
  • మోదీ ఒక్క ఫోన్ చేస్తే జగన్ అమరావతిని కాదంటారా?: రామకృష్ణ
  • రాజధాని ఏదంటే బొత్స జవాబు చెప్పలేకపోతున్నారు: రామకృష్ణ
  • అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని జగన్‌ ప్రకటించాలి: రామకృష్ణ
  • రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేస్తున్నారు: రామకృష్ణ
  • రాష్ట్రంలో ఏ రంగంలోనూ అభివృద్ధి కనిపించడం లేదు: రామకృష్ణ
  • కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ఎవరు అడ్డం వచ్చారు?: రామకృష్ణ
  • దిల్లీలో రైతులు ఏడాదిపాటు పోరాడి విజయం సాధించారు: రామకృష్ణ
  • అమరావతి రైతుల పోరాటం కూడా విజయం సాధిస్తుంది: రామకృష్ణ

16:55 December 17

అమరావతిని ఆపే శక్తి జగన్‌కు లేదు: భాజపా నేత రావెల

  • అమరావతిని ఆపే శక్తి జగన్‌కు లేదు: భాజపా నేత రావెల
  • ఎస్సీల భవిష్యత్తు కోసం తెచ్చిన రాజధానిని జగన్ నాశనం చేశారు: రావెల
  • అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టుకు జగన్‌ తూట్లు పొడిచారు: రావెల

16:55 December 17

అమరావతి రూపశిల్పి.. చంద్రబాబు: ఎంపీ రఘురామ

  • అమరావతి రూపశిల్పి.. చంద్రబాబు: ఎంపీ రఘురామ
  • అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్ మోడల్‌గా రూపొందించారు: రఘురామ
  • పాదయాత్రలో మహిళలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు: రఘురామ
  • చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారు: రఘురామ
  • పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదు: రఘురామ
  • రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది: రఘురామ
  • రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదు: రఘురామ
  • కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుంది: రఘురామ

16:54 December 17

'అమరావతి అందరిదీ' సభావేదికపై చంద్రబాబు

  • తిరుపతి: 'అమరావతి అందరిదీ' సభావేదికపై చంద్రబాబు
  • పచ్చకండువాలు ఊపుతూ చంద్రబాబుకు స్వాగతం పలికిన రైతులు
  • వేదికపై చంద్రబాబును ఆలింగనం చేసుకున్న ఎంపీ రఘురామ

16:27 December 17

ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: మస్తాన్ వలీ

  • ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: మస్తాన్ వలీ
  • అమరావతే రాజధాని అని జగన్ నమ్మించారు: మస్తాన్ వలీ
  • అధికారంలోకి వచ్చాక జగన్‌ మాటమార్చారు: మస్తాన్ వలీ
  • జగన్‌ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు: మస్తాన్ వలీ
  • అమరావతి రైతుల త్యాగం, కృషి వృథా కావు: మస్తాన్ వలీ

16:17 December 17

అమరావతి మహిళల పాదయాత్ర చూసి జగన్ భయపడ్డారు: శివాజీ

  • సభావేదికపైకి అన్ని పార్టీల నేతలు వచ్చారు.. వైకాపా తప్ప..: శివాజీ
  • నిర్ణయం తీసుకోవాల్సిన వైకాపా నేతలు మాత్రం రాలేదు: శివాజీ
  • తమ భవిష్యత్తును తొక్కేస్తున్న వారిపై విద్యార్థులు మాట్లాడరా?: శివాజీ
  • సీఎం జగన్ ఎన్నో తప్పులు చేస్తున్నారు: నటుడు శివాజీ
  • జగన్ చేసిన తప్పులు ఇప్పటికే వంద దాటాయి: శివాజీ
  • అమరావతి మహిళల పాదయాత్ర చూసి జగన్ భయపడ్డారు: శివాజీ

15:56 December 17

సభకు పవన్ కల్యాణ్‌ సందేశం.. రైతుల పక్షానే జనసేన ఉంటుంది: రామదాసు చౌదరి

  • జనసేన ప్రతినిధిగా సభకు హాజరైన రామదాసు చౌదరి
  • సభకు పవన్ కల్యాణ్‌ సందేశం పంపారు: రామదాసు చౌదరి
  • అమరావతే రాజధానిగా ఉంటుందని పవన్ అన్నారు: రామదాసు చౌదరి
  • రైతుల పక్షానే జనసేన ఉంటుంది: రామదాసు చౌదరి
  • రైతుల పాదయాత్ర జనం మదిలో నిలిచిపోతుంది: రామదాసు

15:55 December 17

మహిళలను ఏడిపించిన ప్రభుత్వం బాగుపడదు: పాతూరి నాగభూషణం

  • మహిళలను ఏడిపించిన ప్రభుత్వం బాగుపడదు: పాతూరి నాగభూషణం
  • జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వమిది: పాతూరి నాగభూషణం
  • తుగ్లక్ పాలనతో అమరావతి విచ్ఛిన్నమైంది: పాతూరి నాగభూషణం
  • అమరావతి అభివృద్ధికి మోదీ మద్దతు ఉంది: పాతూరి నాగభూషణం

15:50 December 17

కిక్కిరిసిన అమరావతి మహోద్యమ సభాప్రాంగణం

కిక్కిరిసిన సభా ప్రాంగణం
  • కిక్కిరిసిన అమరావతి మహోద్యమ సభాప్రాంగణం
  • తిరుపతి: నిండిపోయిన సభాప్రాంగణంలోని గ్యాలరీలు
  • వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అశేష జనవాహిని
  • ఆకుపచ్చ కండువాలు, టోపీలతో భారీగా పాల్గొన్న ప్రజలు
  • సభావేదిక వద్ద రహదారిపై గుంపులు గుంపులుగా ప్రజలు

15:42 December 17

అమరావతి అనేది.. సంపద సృష్టి కేంద్రం: దళిత ఐకాస నేతలు

  • సభలో తమ ఆవేదన వినిపించిన పాదయాత్రలో పాల్గొన్న రైతులు
  • అమరావతి అనేది.. సంపద సృష్టి కేంద్రం: దళిత ఐకాస నేతలు
  • అమరావతిని జగన్ విచ్ఛిన్నం చేశారు: దళిత ఐకాస నేతలు
  • ఎస్సీ రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి బేడీలు వేశారు: దళిత ఐకాస

15:41 December 17

గడప దాటని మమ్మల్ని రోడ్డెక్కే దుస్థితి కల్పించారు: మహిళా రైతులు

  • సభా వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మహిళా రైతులు
  • పాదయాత్రలో ఎన్నో ఆంక్షలు, ఇబ్బందులు అధిగమించాం: మహిళా రైతులు
  • గడప దాటని మమ్మల్ని రోడ్డెక్కే దుస్థితి కల్పించారు: మహిళా రైతులు
  • అమరావతి మహిళలు ఆదిపరాశక్తులని చాటాం: మహిళా రైతులు

15:32 December 17

అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు హాజరైన పార్టీల నేతలు

హాజరైన వివిధ పార్టీల నాయకులు
  • అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు హాజరైన పార్టీల నేతలు
  • సభకు హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  • తిరుపతి: సభకు హాజరైన ఎంపీ రఘురామకృష్ణరాజు
  • సభకు హాజరైన పరిటాల సునీత, వర్ల రామయ్య, గౌతు శిరీష
  • సభకు హాజరైన కన్నా, రావెల, పాతూరి నాగభూషణం
  • సభకు హాజరై రైతులకు సంఘీభావం తెలిపిన సినీనటుడు శివాజీ
  • సభకు హాజరైన భాజపా, జనసేన ప్రతినిధులు

14:48 December 17

ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోరికే అమరావతి: చంద్రబాబు

  • తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
  • శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
  • 5 కోట్ల రాష్ట్ర ప్రజల కోరికే అమరావతి: చంద్రబాబు
  • పాదయాత్రలో పాల్గొన్న వారికి మద్దతిచ్చేందుకే వచ్చా: చంద్రబాబు
  • అమరావతి మహోద్యమ సభకు హాజరవుతున్నా: చంద్రబాబు
  • తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరిన చంద్రబాబు

14:40 December 17

అమరావతి పరిరక్షణ సభావేదికపై సర్వమత ప్రార్థనలు

  • తిరుపతి: అమరావతి పరిరక్షణ సభావేదికపై సర్వమత ప్రార్థనలు
  • తిరుపతి: ఉద్యమంలో చనిపోయిన రైతులకు నివాళులు

14:10 December 17

దగాపడ్డ రైతుల సభ.. రాజకీయ సభ కాదు: ఎంపీ రఘురామ

  • దగాపడ్డ రైతుల సభ.. రాజకీయ సభ కాదు: ఎంపీ రఘురామ
  • రైతులకు మద్దతు కోసం అన్నివర్గాలు తరలివస్తున్నాయి: రఘురామ
  • సభ తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరు: రఘురామ
  • నూరు శాతం అమరావతి రాజధానిగా ఉంటుంది: రఘురామ
  • అడ్డుపడే మేఘాలు అశాశ్వతం.. అమరావతే శాశ్వతం: రఘురామ

14:00 December 17

తిరుపతి విమానాశ్రయం చేరుకున్న వైకాపా ఎంపీ రఘురామ

  • తిరుపతి విమానాశ్రయం చేరుకున్న వైకాపా ఎంపీ రఘురామ
  • ఎంపీ రఘురామకు స్వాగతం పలికిన అమరావతి జేఏసీ నేతలు
  • రైతుల మహోద్యమ సభకు హాజరుకానున్న ఎంపీ రఘురామ

13:53 December 17

తిరుమల చేరుకున్న చంద్రబాబు

  • తిరుమల చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • చంద్రబాబుకు స్వాగతం పలికిన తితిదే అధికారులు
  • పద్మావతి అతిథిగృహం వద్ద చంద్రబాబుకు స్వాగతం
  • కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతి రానున్న చంద్రబాబు
  • అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో పాల్గొననున్న చంద్రబాబు

13:32 December 17

  • తిరుపతి వేదికగా అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ
  • రైతుల పాదయాత్ర ముగింపుగా తిరుపతిలో బహిరంగ సభ
  • తిరుపతి: సాయంత్రం 6 వరకు కొనసాగనున్న బహిరంగ సభ
  • తిరుపతి: సభకు హాజరుకానున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • సభకు హాజరుకానున్న భాజపా, జనసేన, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు
  • సభ అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశం

12:47 December 17

తెదేపా నాయకుల సంఘీభావ ర్యాలీ

  • నరసరావుపేటలో తెదేపా నాయకుల సంఘీభావ ర్యాలీ
  • అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా సంఘీభావ ర్యాలీ
  • చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
  • తెదేపా కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న తెదేపా కార్యకర్తలు, వామపక్ష నాయకులు

11:35 December 17

తిరుపతి రైతుల సభకు తరలివచ్చిన న్యాయవాదులు

  • తిరుపతి రైతుల సభకు తరలివచ్చిన న్యాయవాదులు
  • సభకు ఎందరు రావాలనే నిబంధన ఎక్కడా లేదు: లాయర్‌ లక్ష్మీనారాయణ
  • సభకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు: న్యాయవాది
  • ఆంక్షల పేరుతో అడ్డుకుంటే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది: లక్ష్మీనారాయణ
  • సభకు వచ్చేవారిని గృహనిర్బంధం చేయడంపై కోర్టు దృష్టికి తెస్తాం: న్యాయవాది
  • కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీసులు శిక్షార్హులు: న్యాయవాది

11:12 December 17

సభను విజయవంతం చేస్తామన్న జేఏసీ

  • తిరుపతి రైతుల మహాసభపై మొదలైన పోలీసుల ఆంక్షలు
  • తెదేపా నేతలు లక్ష్యంగా సాగుతున్న పోలీసుల ఆంక్షలు
  • పలుచోట్ల తెదేపా నేతలు తిరుపతి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు
  • చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు
  • అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామన్న జేఏసీ
  • సభకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై రైతుల ఆగ్రహం
  • సభకు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే కుట్ర: అమరావతి రైతులు

09:55 December 17

పలు జిల్లాల నుంచి తిరుపతి సభకు వెళ్లేవారిని అడ్డుకుంటున్న పోలీసులు

  • పలు జిల్లాల నుంచి తిరుపతి సభకు వెళ్లేవారిని అడ్డుకుంటున్న పోలీసులు
  • ఎక్కడికక్కడ నాయకులను గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు
  • కడప: రాయచోటిలో తెదేపా నేతల గృహ నిర్బంధం
  • తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష గృహ నిర్బంధం
  • తిరుపతి సభకు వెళ్లకుండా రాత్రి నుంచి పోలీసుల పహారా

08:39 December 17

పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు

  • తిరుపతి సభకు అమరావతి నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు
  • ప్రత్యేక బస్సుల్లో భారీగా తరలివచ్చిన 29గ్రామాల ప్రజలు
  • రైతులకు మద్దతుగా సభాస్థలికి తరలివస్తున్న ఇతర ప్రాంతాల ప్రజలు

08:25 December 17

అమరావతి ఐకాస బహిరంగ సభకు.. రాజధాని గ్రామాల ప్రజలు

తిరుపతిలో నేటి అమరావతి ఐకాస బహిరంగ సభకు.. రాజధాని గ్రామాల నుంచి ప్రజలు తరలివెళ్లారు. ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న రైతులు తిరుపతిలోనే ఉన్నారు. వారి కుటుంబసభ్యులు కూడా గత రెండు, మూడు రోజుల నుంచి తిరుపతి వెళ్తున్నారు. గురువారం రాత్రి కూడా తిరుపతి బహిరంగ సభకు ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. తుళ్లూరు, పెదపరిమి నుంచి ఈ బస్సులు తిరుపతి వెళ్లాయి. తిరుపతి సభను జయప్రదం చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.

08:21 December 17

అమరావతి ఐకాస సభకు బయలుదేరిన భాజపా బృందం

  • అమరావతి ఐకాస సభకు బయలుదేరిన భాజపా బృందం
  • కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో తిరుపతి బయల్దేరిన నేతలు
  • రాష్ట్ర భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు: కన్నా
  • జగన్ సీఎం అయ్యాక రైతులను మోసం చేశారు: కన్నా
  • మూర్ఖత్వపు ఆలోచనతోనే 3 రాజధానుల ప్రకటన: కన్నా
  • ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు: కన్నా
  • అమరావతి రైతులను పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టారు: కన్నా
  • ప్రభుత్వం పెట్టే బాధలను భరించి పాదయాత్ర పూర్తి చేశారు: కన్నా
  • రాజధానిగా అమరావతే ఉండాలన్న ఆకాంక్ష నెరవేరాలి: కన్నా
  • అమరావతిలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఉండాలి: కన్నా

08:13 December 17

హాజరైన పలు పార్టీల రాజకీయ నేతలు

  • తిరుపతి వేదికగా నేడు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ
  • 'అమరావతి అందరిది' పేరుతో రైతుల భారీ బహిరంగ సభ
  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు సాగనున్న సభ
  • న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రైతుల మహాపాదయాత్ర
  • తుళ్లూరు నుంచి అలిపిరి వరకు 44 రోజులు సాగిన రైతులు, మహిళల పాదయాత్ర
  • మహాపాదయాత్ర ముగింపుగా నేడు తిరుపతిలో బహిరంగ సభ
  • అమరావతి పరిరక్షణ సభకు వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం
  • సభకు హాజరుకానున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • సభకు హాజరుకానున్న భాజపా, కాంగ్రెస్‌, జనసేన, వామపక్ష పార్టీల నేతలు
  • సభ అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం

Last Updated : Dec 17, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.