ETV Bharat / city

'రాష్ట్రానికి ఏకైక రాజధానిగా.. అమరావతిని కొనసాగించాల్సిందే'

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట అమరావతి పరిరక్షణ రాజకీయేతర ఐకాస ప్రజాపోరాట దీక్ష చేపట్టింది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్​ చేశారు.

amaravathi jac protest before guntur district collectorate
అమరావతి ఐకాసకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ప్రజాపోరాట దీక్ష
author img

By

Published : Jan 20, 2021, 2:04 PM IST

అమరావతి ఐకాసకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ప్రజాపోరాట దీక్ష

అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరిన సందర్భంగా.. రైతులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట అమరావతి పరిరక్షణ రాజకీయేతర ఐకాస ప్రజాపోరాట దీక్ష నిర్వహించింది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నేతలు నినాదాలు చేశారు. దుష్ప్రచారంతో అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇన్ సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఇన్నాళ్లూ అవాస్తవాలు ప్రచారం చేసిన ప్రభుత్వానికి.. హైకోర్టు తాజా తీర్పు చెంపపెట్టని అన్నారు.

ఇదీ చదవండి:

పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.