ETV Bharat / city

'అమరావతి కోసం ఆందోళన చేస్తుంటే.. అనవసరంగా రెచ్చగొట్టకండి' - అమరావతి తాజా వార్తలు

రాజధానిలో ఇళ్లులేని వారికి నివాసాలు ఇస్తామంటే తాము అడ్డుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనను అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఖండించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తాము నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో.. రైతులు, మహిళలను రెచ్చగొట్టేలా మంత్రి వ్యాఖ్యానించడం సరికాదంది.

amaravathi jac
amaravathi jac
author img

By

Published : Sep 8, 2020, 7:19 PM IST

అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విజయవాడలో స్పందించారు. రాజధాని రైతులకు ఇస్తానన్న ప్యాకేజి ఇచ్చి.. సీఆర్డీఏ చట్టాన్ని గౌరవించాలని డిమాండ్‌ చేశారు. అమరావతిని ముంబాయిలో ధారావి మాదిరిగా మరో మురికికూపం చేయబోతున్నారా? అని ప్రశ్నించారు. అమరావతిలో 1960 ఎకరాల స్ధలంలో రెండు లక్షల మంది ఎలా జీవిస్తారని ప్రశ్నించారు.

ఈ ప్రాంతం ఓ శ్మశానం, ఎడారి అని చెప్పిన అధికార పార్టీ నేతలు అమరావతిలో పేదలకు ఎలా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని ప్రశ్నించారు. రాజధానిలో నిర్మించిన ఇళ్లను రాజధానిలో ఉంటున్న పేదలకు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇస్తామనడం సరైంది కాదన్నారు. కులాలు,‌ సామాజికవర్గాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని హితవు పలికారు. ఐకాస కన్వీనరు మల్లికార్జునరావు, మహిళా ఐకాస నాయకురాలు డాక్టరు శైలజ, దళిత ఐకాస ప్రతినిధి చిలకా బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా పథకాలన్నీ.. కొత్త సీసాలో పాత సారాలాంటివి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.