తాను చేసిన సేవా కార్యక్రమాలను చూసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించారని అంబుల వైష్ణవి పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా ఎకరం భూమి విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రంలోని ప్రజలంతా ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందించారని.. ఇప్పుడు మూడు రాజధానుల పేరిట అమరావతి రైతులను మోసం చేయడం తగదని వైష్ణవి అభిప్రాయపడ్డారు. రాజధానిగా అమరావతి కొనసాగేలా తనవంతుగా అవసరమైతే దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తానని వైష్ణవి తెలిపారు. రాజధానిగా అమరావతి కొనసాగితే ఆ ప్రాంతంలో కైలాసగిరి ఏర్పాటు చేస్తామని వైష్ణవి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఈ నెల 12న వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభం