పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 335వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పెదపరిమి, ఐనవోలు గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు.
రాజధాని ప్రాంతంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇళ్ల ఆక్రమణకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తుళ్లూరులో సీపీఐ నేతల అరెస్టులను నిరసిస్తూ మందడంలో రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అంతా రివర్స్ పరిపాలన చేస్తున్నారంటూ విమర్శించారు.
నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని, చెవుల్లో పూలు పెట్టుకొని దీక్షా శిబిరం నుంచి పోలేరమ్మ ఆలయం వరకు వెనక్కి నడుచుకుంటూ వెళ్లారు. ఉద్ధండరాయుని పాలెంలో మహిళలు దీక్షా శిబిరం నుంచి బొడ్డురాయి కూడలి వరకు పాదయాత్ర చేపట్టారు.
ఇవీ చదవండి: