అమరావతి రాజధానిగా శంకుస్థాపన జరిగి ఐదేళ్లయిన సందర్భంగా గుంటూరు నుంచి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. మదర్ థెరిసా విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర... గోరంట్ల, లాం ఫాం, తాడికొండ, పెదపరిమి మీదుగా ఉద్దండరాయునిపాలెం దిశగా సాగుతోంది. ఐకాస నేతలు, రైతులు, రాజకీయ పార్టీల నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాజధాని మార్చేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం అడ్డుకోవాలని రైతులు, ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మొండివైఖరితో ముందుకెళ్లి అమరావతి నుంచి రాజధాని మారిస్తే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు ఇబ్బందులు వస్తాయన్నారు.
అమరావతి కోసం 310రోజులుగా జరుగుతున్న ఆందోళనలను గుర్తించాలన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను మోసం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర మధ్యలో ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఐకాస ప్రతినిధులు ముందుకు వెళ్తున్నారు. అమరావతి ఉద్యమం కేవలం రైతులది మాత్రమే కాదని... అన్ని ప్రాంతాల ప్రజలదని వారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: