ETV Bharat / city

PADAYATRA : 15వ రోజూ దిగ్విజయంగా పాదయాత్ర...అడుగడుగునా సాదరస్వాగతం

అమరావతిని(Amaravathi) ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన మహాపాదయాత్ర(Farmers Maha Padayatra) 15వ రోజూ దిగ్విజయంగా ముగిసింది. 13 జిల్లాల వారితో పాటు తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka), ఒడిశా(Odisha) నుంచి వచ్చిన జనం జై అమరావతి నినాదాలతో సంఘీభావం తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అపూర్వ మద్దతుతో పాదయాత్రలో కదం తొక్కిన అన్నదాతలు, మహిళలు.. ప్రభుత్వం 3 రాజధానుల(three capitals) నిర్ణయంపై వెనక్కు తగ్గేవరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

15వ రోజూ దిగ్విజయంగా పాదయాత్ర
15వ రోజూ దిగ్విజయంగా పాదయాత్ర
author img

By

Published : Nov 15, 2021, 9:45 PM IST

Updated : Nov 16, 2021, 4:52 AM IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర 15వ రోజైన సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలో ఎం.నిడమనూరులో ప్రారంభమై, కె.ఉప్పలపాడు, చిర్రికూరపాడు మీదుగా 15 కిలోమీటర్లు సాగి సాయంత్రం కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగిసింది. రెండురోజులుగా కురిసిన వర్షానికి ఎం.నిడమలూరు నుంచి ఉప్పలపాడు వరకు ఉన్న రోడ్డు బురదమయమైంది. ఆ బురదలోనే మూడు కిలోమీటర్లు పాదయాత్ర ముందుకు సాగింది. ఉప్పలపాడు నుంచి చిర్రికూరపాడు వరకు ఏడు కిలోమీటర్లు మధ్యలో ఎక్కడా గ్రామాలు లేకపోయినా కట్టుబడిపాలెం, జరుగుమల్లి మండలాల ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. చిర్రికూరపాడుకు చెందిన 30 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఏడు కిలోమీటర్ల పొడవునా ‘రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతే. రైతుల త్యాగాలు వృథాకావు’ వంటి నినాదాలతో తోరణాలు కట్టారు. పాలేరు వంతెనకు ఇరువైపులా పూలు, అరటిచెట్లు, బెలూన్లతో అలంకరించారు. పాదయాత్రికులతో పొగాకు రైతులు, కూలీలు మాట్లాడుతూ... ‘మీ కష్టం ఊరికే పోదు. మీరు బయటకు వచ్చి ఇబ్బందులపై పోరాటం చేస్తున్నారు. మేం పంటలు పండక, గిట్టుబాటు లేక, చేసిన కష్టమూ మిగలక అగచాట్లు పడుతున్నాం’ అని ఆవేదన పంచుకున్నారు.

విక్కిరాలపేట సమీపంలోని పాలేరు వంతెనపై కిక్కిరిసిన జనం

ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది: ఐకాస
అమరావతి ఐకాస కోకన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, కన్వీనర్‌ శివారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రైతుల ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై విచారణ మొదలైందని, అమరావతి అంశాన్ని త్వరగా తేల్చాలని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిందన్నారు. కొండపి, పర్చూరుల ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సంఘీభావం తెలిపారు.

హీలియం గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకరి మృతి
పాదయాత్రలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు సమీపంలో హీలియం సిలిండర్‌ పేలి ఒకరు మృతిచెందారు. బెలూన్లకు గ్యాస్‌ నింపే హీలియం సిలిండర్‌ను ఆటోకు అమర్చారు. పాలేరు వంతెన వద్ద గ్యాస్‌ నింపుతుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. దాంతో విజయవాడ కృష్ణలంకకు చెందిన విన్నకపోట రాఘవేంద్రరావు(60), మేడా నవీన్‌(21), షకలాబత్తుల భాస్కరరావుకు గాయాలయ్యాయి. బాధితులను ఒంగోలు రిమ్స్‌కు తరలించగా... చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మృతిచెందారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు.

మహాపాదయాత్రలోనే 700వ రోజు నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ప్రారంభించిన నిరసనలు మంగళవారం 700వ రోజుకు చేరనున్నాయి. సాధారణంగా ప్రత్యేక రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టే రైతులు... ఈసారి వీటిని మహా పాదయాత్రలో నిర్వహించనున్నారు. 16వ రోజైన మంగళవారం ఉదయం విక్కిరాలపేట నుంచి మొదలవుతుంది. ఈ సందర్భంగా ప్రైవేటు స్థలంలో వినూత్న రీతిలో నిరసనలు చేపట్టనున్నారు. వాటిలో పాలుపంచుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు బయలుదేరి వెళ్లారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 16, 2021, 4:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.