ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 539వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, పెదపరిమి, నెక్కల్లులో నిరసన దీక్షలు చేపట్టారు. కౌలు డబ్బులు విడుదల చేయాలంటూ రైతులు, మహిళలు సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. అసైన్డ్ రైతులకు ఇంతవరకు కౌలు విడుదల చేయలేదని లేఖలో వెల్లడించారు. కూలీలకు ఇచ్చే పెన్షన్‌ను రూ. 5 వేలకు పెంచి ఇస్తామని వాగ్దానం చేశారని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
mp raghurama: అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ