పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని గ్రామాలలో 271వ రోజు రైతులు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు గ్రామ దేవతలకు పొంగళ్లు సమర్పించారు. ఉద్ధండరాయునిపాలెం, మందడం, ఎర్రబాలెం, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో రైతులు, మహిళలు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆరు గ్రహాలు ఒకే స్థానంపై వచ్చాయని మళ్లీ 2250 సంవత్సరంలో ఇలాంటి రోజు వస్తోందని మహిళలు చెప్పారు. ఇలాంటి శుభఘడియలలో ఎలాంటి సంకల్పం దీక్ష తీసుకున్న నెరవేరుతుందని.....అందుకే ఆదిత్య పారాయణం చేస్తూ పూజలు చేశామని మహిళలు చెప్పారు. దీంతో రాజధానికి ఉన్న గ్రహాలు తొలగిపోతాయని మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలు చేస్తున్న పూజలకు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూజలో పాల్గొని మద్దతు తెలిపారు.
అసైన్డ్ భూములనుద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రైతులు ఖండించారు. అసైన్డ్ రైతులు అవసరాల కోసం భూములు అమ్ముకోవద్దా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను అమరావతి ఐకాస నేతలు ఖండించారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగందని పదే పదే చెబుతున్న మంత్రి....15 నెలలైనా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. రాజదాని ఉద్యమంలో 80మందికిపైగా ప్రాణత్యాగం చేసినా స్పందించని ప్రభుత్వం....తమ భూముల విషయంలో ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు.
ఇదీ చదవండి