దిల్లీలో ఏడో రోజు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు, రైతుల పర్యటన కొనసాగుతోంది. ఐకాస నేతలు, రైతులు, తెదేపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జోక్యం చేసుకునేలా కేంద్రానికి సూచన చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఐకాస నేతలు, రైతులు.. అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చొరవ చూపాలని వినతిపత్రం అందించారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఐకాస నేతలు వివరించారు.
ఇవీ చదవండి: