ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు 52వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడితో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో రైతులు దీక్షలు చేస్తున్నారు. "మూడు రాజధానులు వద్దు - అమరావతే ముద్దు”, "సేవ్ ఏపీ - సేవ్ అమరావతి" నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాల్లో భారీ సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతుల ఆందోళనలకు దిగారు. ఐనవోలు, నవులూరు, ఇతర గ్రామాల్లోనూ రైతులు అమరావతే రాజధానిగా కావాలంటూ తమ నిరసనలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: ఉద్ధృతంగా అమరావతి రైతుల ఉద్యమం