Amararaja mascot ron: బ్యాటరీల సంస్థ అమరరాజా నూతన మస్కట్ రాన్‌ను విడుదల చేసింది. బుధవారం తిరుపతి జిల్లా కరకంబాడీ పరిశ్రమలో జరిగిన కార్యక్రమంలో అమరరాజా బ్యాటరీస్ సీఎండీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ తమ బ్యాటరీల బ్రాండ్ అమరాన్‌కు ఈ లోగో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తుందన్నారు. బ్రాండ్ మస్కట్‌ను విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, ఇది సరైన సమయంగా భావించి ఆవిష్కరించామన్నారు.
ప్రచారకర్తల కంటే మస్కట్ కాలాతీతంగా ఉంటుందని పేర్కొన్నారు. అమరాన్ బ్రాండ్ బ్యాటరీలను ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు విస్తరించాలను కుంటున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ సుజోయ్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: