ETV Bharat / city

ఆళ్ల రామకృష్ణారెడ్డికి రెండోసారీ దక్కని మంత్రి పదవి.. ఏమన్నారంటే..? - ఏపీ తాజా వార్తలు

Alla Ramakrishna Reddy: మంత్రి పదవ దక్కకపోయినా రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్​ వెంటే ఉంటానని ఎమ్మెల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నూతన మంత్రివర్గం, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాననే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Alla Ramakrishna Reddy
ఎమ్మెల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Apr 11, 2022, 9:46 AM IST

Alla Ramakrishna Reddy: మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు. 2019 ఎన్నికల ప్రచార సభలో ఆళ్లకు మంత్రి పదవి ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కానీ మొదటి, రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం దక్కలేదు. తాజాగా ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి పదవి రాకపోయినా తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని అన్నారు. నూతన మంత్రివర్గం, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు.

ఇదీ చదవండి: Thippeswamy: స్థానం దక్కినట్లే దక్కి.. కానీ కొన్ని నిమిషాల్లోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.