ETV Bharat / city

TS Inter Results: విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఫెయిలైనోళ్లంతా పాస్‌..!

Inter first year results: తెలంగాణలోని ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

విద్యార్థులకు గుడ్​న్యూస్
విద్యార్థులకు గుడ్​న్యూస్
author img

By

Published : Dec 24, 2021, 7:39 PM IST

Inter first year results: తెలంగాణలోని ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 10 మార్కులు కలిపితే 8,070 మంది, 25 మార్కులు కలిపితే 70 వేల మంది ఉత్తీర్ణులవుతారన్న మంత్రి.. ఫెయిలైనవాళ్లందరికీ కనీస మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

పొరపాటు లేకున్నా నిందిస్తున్నారు..
ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. నెల రోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకున్నా.. ప్రభుత్వాన్ని నిందించడం చాలా బాధ కలిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

"ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. నెల రోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించాం. 4.50 లక్షల మంది ఫస్టియర్‌ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 49శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదు. 10 వేల మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించారు. ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరం. ప్రభుత్వాన్ని నిందించడం చాలా బాధ కలిగించింది. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల విషయంలో బోర్డు తప్పేమీలేదు. ఇంటర్‌ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారు. ఇంటర్‌ పరీక్షల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా." - సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మంత్రి

విద్యాసంస్థల అప్​గ్రేడ్​..
కరోనా సమయంలో విద్యావ్యవస్థ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యార్థులకు బోధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. టెలివిజన్​, యూట్యూబ్​, వాట్సప్​ గ్రూప్​లు.. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. తెలంగాణలో 620 గురుకులాలు, 172 కస్తుర్బా పాఠశాలలను ఇంటర్​కు అప్​గ్రేడ్​ చేసినట్టు తెలిపారు.

"కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం. దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించాం. వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సమన్వయం సాధించాం. 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశాం. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య చాలా కీలకం. 620 గురుకులాలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేశాం. 172 కస్తుర్బా కళాశాలలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేశాం. ఇంటర్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. టీ-శాట్‌, దూరదర్శన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచాం. యూట్యూబ్‌ ఛానెళ్లలో కూడా పాఠాలు అందుబాటులో ఉంచాం." - సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి

ఇదీ చూడండి:
మంత్రుల వ్యాఖ్యలపై హీరో సిద్దార్థ్ సెటైర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.