సీఏఏను ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్సీని రద్దు చేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏను వ్యతిరేకిస్తూ ముస్లింలు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో జాతీయజెండాలు చేతబూని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం శాస్త్రిపురంలో ఎన్ఆర్సీ, సీఏఏను వ్యతిరేకిస్తూ భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో వివిధ సంఘాల నేతలు, ముస్లిం మతపెద్దలు, మహిళా సంఘాల నాయకులు, వివిధ వర్గాలవారు పాల్గొన్నారు.
జనవరి 25న ముషాయిరా..
జనవరి 25న ఛార్మినార్ వద్ద ముషాయిరాను ఏర్పాటు చేస్తామని... అర్ధరాత్రి దాటగానే జాతీయజెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలు జరుపుతామని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో అన్ని వర్గాలవారు హాజరు కావాలని సూచించారు. జనవరి 30న బాపూఘాట్ వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహిస్తామన్నారు.
ఇవీ చూడండి: