హైకోర్టును అమరావతిలోనే ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఇవాళ విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'చలో హైకోర్టు' ర్యాలీ చేపట్టారు. హైకోర్టును కర్నూలుకు తరలిస్తే ఉద్యమాన్ని మరితం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 3 రాజధానులతో పాటు హైకోర్టు తరలింఫు యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ర్యాలీకి తెదేపా నేతలు దేవినేని ఉమా, బొండా ఉమ మద్దతు తెలిపారు. రాజధానులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు తెదేపా పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని నేతలు చెప్పారు.
ఇదీ చదవండి : హస్తినకు అమరావతి ప్రాంత రైతులు..!