ఇదీ చదవండి:
'ఎస్ఈసీ కేసులో పూర్తిస్థాయి విచారణకు సిద్ధం కావాలని సుప్రీం చెప్పింది' - నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు
నిమ్మగడ్డ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు... పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దేశ సర్వోన్నతన్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. నిమ్మగడ్డ అంశంలో కేవియట్ వేసిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు... విచారణకు సంబంధించిన విషయాలను ఈటీవీభారత్కు వివరించారు. నిమ్మగడ్డ కేసులో మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వలేమని... పూర్తి స్థాయి విచారణకు సిద్ధం కావాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. త్వరలోనే స్పష్టమైన తీర్పు వస్తుందని తెలిపారు.
advocate nara srinivas rao