ఎస్ఈసీగా నీలం సాహ్ని(Neelam Sahni) నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు(High Court) విచారణ జరిపింది. సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకి తెలిపారు. ఈ వ్యాజ్యంలో ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. వచ్చే నెల 2లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
VAHANAMITHRA: వాహన మిత్ర స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ