లాక్‌డౌన్ కారణంగా దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు అదనపు మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో విడతలో రూ.43.28 కోట్లు ఆర్ధిక సాయంగా అందించేందుకు పాలనా అనుమతులు జారీ చేసింది. తొలిదశలో ఆర్థిక సాయం అందని కుటుంబాలకు ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మొదటి దశలో ఉచిత రేషన్ తీసుకుని ఆర్థిక సాయం పొందని కుటుంబాలకు ఈ మొత్తాన్ని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాల్సిందిగా గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ను ప్రభుత్వం ఆదేశించింది. తొలిదశలో 1. 33 కోటి బియ్యం కార్డు దారులకు, 98 లక్షల పైచిలుకు రేషన్ కార్డు దారులకు ఆర్థిక సాయం పంపిణీ చేసేందుకు 133 కోట్ల రూపాయల్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'మేం ఇక్కడ ఉన్నాం.. మమ్మల్ని రాష్ట్రానికి తీసుకెళ్లండి'