ETV Bharat / city

ప్రముఖ నటుడికి కరోనా

ఇప్ప‌టికే టాలీవుడ్​, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప‌లువురు న‌టులకు క‌రోనా సోక‌గా.. తాజాగా 'అల వైకుంఠపురము'లో ఫేమ్ జయరామ్ సుబ్రమణ్యం కొవిడ్​ కోరల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం హోమ్​ ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు ఆయన తెలిపారు.

జయరామ్
జయరామ్
author img

By

Published : Jan 23, 2022, 7:21 PM IST

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అన్న తేడాలేకుండా ప్రతిఒక్కరూ ఈ వైరస్​ బారినప‌డుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్​, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప‌లువురు న‌టులకు క‌రోనా సోక‌గా.. తాజాగా 'అల వైకుంఠపురము'లో ఫేమ్ జయరామ్ సుబ్రమణ్యం కొవిడ్​ కోరల్లో చిక్కుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. స్వ‌ల్ప‌ ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు. హోమ్​ ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు వివరించారు.

'ఈరోజు నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయి. వైద్యుల సూచ‌న‌ల‌తో హోమ్​ క్వారంటైన్‌లో ఉన్నాను. గ‌త కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోండి. వైర‌స్ ఇంకా మ‌న మ‌ధ్యే ఉంది. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రిస్తూ.. క‌రోనా నిబంధ‌న‌లు పాటించండి' అంటూ జయరామ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యకు రెండోసారి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.