ETV Bharat / city

నీళ్లు ఇస్తామని చెప్పి ఇళ్లలోకి వరదలు తీసుకొచ్చారు: కిషన్​రెడ్డి

ప్రతిపక్షాలకు సమయమివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్​ఎంసీ ఎలక్షన్లు నిర్వహించడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతారనే భయంతోనే ఎన్నికలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. గ్రేటర్​ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్​లోని ఆర్యవైశ్య సంఘంలో రామ్​గోపాల్​ పేటకు చెందిన పలువురు తెరాస సీనియర్​ కార్యకర్తలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కిషన్​రెడ్డితో పాటు పలువురు భాజపా సీనియర్​ నాయకులు పాల్గొన్నారు.

KISHAN
KISHAN
author img

By

Published : Nov 18, 2020, 10:53 AM IST

ప్రతిపక్షాలకు సమయమివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎలక్షన్లు నిర్వహించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతారనే భయంతోనే హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్​లోని ఆర్యవైశ్య సంఘంలో రామ్ గోపాల్ పేటకు చెందిన తెరాస సీనియర్ నాయకులు చీర శ్రీకాంత్​తో పాటు పలువురు తెరాస కార్యకర్తలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాంత్​తో పాటు కార్యకర్తలకు భాజపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా శ్రేణులు సమష్టిగా పనిచేసి భాజపా గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల తీర్పు ముఖ్యం

తెలంగాణలో కేవలం కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతోందని కిషన్​రెడ్డి ఆరోపించారు. దుబ్బాకలో ఓటమి చవి చూసిన అనంతరం తెరాసలో అలజడి చెలరేగిందని అన్నారు. అనంతరం నగరంలో ఆస్తిపన్ను తగ్గించి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి ఎల్ఆర్​ఎస్ రద్దు చేసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని ఆయన ఉద్ఘాటించారు. ఇంటింటికి నీళ్లు ఇస్తానని చెప్పి వరదనీటిని ఇంట్లోకి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఆయుష్మాన్​ భారత్​ పథకం అడ్డుకున్నారు

నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన, నగరంలో అర్హులైన పేదవారికి రెండు పడక గదుల ఇవ్వడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కరోనా సమయంలో రోగుల గురించి పట్టించుకోకుండా సీఎం కేసీఆర్​ కేవలం ఫామ్​హౌజ్​కే పరిమితమయ్యారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు పరచకుండా ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పిన మాటలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు.

ఇదీ చదవండి: కలెక్టర్లు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఎస్​ఈసీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.