ETV Bharat / city

రూ.25 లక్షలకే ఫ్లాట్​​.. మహిళ పేరు మీద కొనుగోలు - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని మాల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి పేరు మీద ఉన్న మరో ఆస్తిని అనిశా అధికారులు గుర్తించారు. మాదాపూర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్​​​​ను నర్సింహారెడ్డి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే నర్సింహారెడ్డితో పాటు మిగిలిన నిందితులని మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని అనిశా తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది.

acp-narsimhareddy-buy-a-plot-with-a-lady-name-at-madhapur-rs-dot-25lakhs
మాల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి
author img

By

Published : Oct 9, 2020, 1:10 PM IST

తెలంగాణలోని మాల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి పేరు మీద ఉన్న మరో ఆస్తిని అనిశా అధికారులు గుర్తించారు. మాదాపూర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్​​​ను నర్సింహారెడ్డి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. మాదాపూర్​కు చెందిన ఓ మహిళ పేరుతో ఫ్లాట్​​​​ను నర్సింహారెడ్డి కొనుగోలు చేశారు. దీనిని రూ.25 లక్షలకు కొనుగోలు చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ మార్కెట్ విలువ ప్రకారం ఫ్లాట్​​​ విలువ రూ.50 లక్షల పైనే ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేస్తున్నారు. సదరు మహిళ విదేశాలకు వెళ్లగా.. ఆమె తిరిగి వచ్చాక నర్సింహారెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని బయటపడనున్నాయి.

నర్సింహారెడ్డి కేసులో అరెస్ట్ చేసిన ఎనిమిది మంది బినామీలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా అనిశా అధికారులు దాఖలు చేసిన పిటీషన్​పైనా గురువారం వాదనలు ముగిశాయి. నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని అనిశా అధికారులు కోరారు. నర్సింహారెడ్డి ఆస్తులను బినామీ పేర్ల మీదు కొనుగోలు చేసినందున.. వారందరిని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అనిశా తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనిశా న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: ఏసీపీ నర్సింహారెడ్డికి 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.